- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొండగట్టు ఆలయానికి మహర్దశ.. డిప్యూటీ సీఎం పవన్ సిఫార్సుతో భారీగా TTD నిధులు!
తెలంగాణ ప్రజల ఆరాధ్య దైవం శ్రీ కొండగట్టు (Kondagattu) ఆంజనేయ స్వామి ఆలయానికి మహర్దశ పట్టబోతోంది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రజల ఆరాధ్య దైవం శ్రీ కొండగట్టు (Kondagattu) ఆంజనేయ స్వామి ఆలయానికి మహర్దశ పట్టబోతోంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సిఫార్సుతో తిరుమల తిరుపతి దేవస్థానం భారీగా నిధులు మంజూరు చేసినట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి త్వరలోనే టీటీడీ (TTD) నుంచి అధికారిక ప్రకటన విడుదల కాబోతున్నట్లుగా సమాచారం. కాగా, 2024 జూన్‌లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆలయాన్ని సందర్శించిన సమయంలో, ఆలయ అధికారులు భక్తుల సౌకర్యార్థం 100 గదులు, దీక్షా మండపం నిర్మాణానికి టీటీడీ నిధులు కేటాయించాలని విన్నవించారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు.
ఇక 2024 అక్టోబర్‌లో టీటీడీ ఇంజినీరింగ్ అధికారులు ఆలయాన్ని సందర్శించి 100 గదుల నిర్మాణానికి ప్లానింగ్ చేశారని, దీనికి ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారం ఉందని స్థానిక నాయకులు, దేవాలయ సిబ్బంది పేర్కొన్నారు. సాధారణంగా టీటీడీ తమ పరిధిలోని ఆలయాలు లేదా సంబంధిత ప్రాజెక్టులకు నిధులను నేరుగా కేటాయిస్తుంది. అయితే, కొండగట్టు ఆలయం తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఉండటంతో డిప్యూటీ సీఎం పవన్ చొరవ తీసుకుని నిధుల విడుదలకు సిఫార్సు చేయగా.. స్పందించిన టీటీడీ భారీగా నిధులు కేటాయించినట్లుగా తెలుస్తోంది.






