మంత్రి కోమటిరెడ్డితో మహారాష్ట్ర మంత్రి భేటీ.. ఎందుకంటే..?

by Ramesh Naini |

రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో మహారాష్ట్ర ఐటీ,సినిమాటోగ్రఫీ మంత్రి ఆశిష్ శెలార్ శుక్రవారం డా.బి.ఆర్ అంబేడ్కర్ రాష్ట్ర సెక్రటేరియట్‌లో భేటీ అయ్యారు.

మంత్రి కోమటిరెడ్డితో మహారాష్ట్ర మంత్రి భేటీ.. ఎందుకంటే..?
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో మహారాష్ట్ర ఐటీ,సినిమాటోగ్రఫీ మంత్రి ఆశిష్ శెలార్ శుక్రవారం డా.బి.ఆర్ అంబేడ్కర్ రాష్ట్ర సెక్రటేరియట్‌లో భేటీ అయ్యారు. సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం ప్రభుత్వ పాలసీ అంశాలపై ఇరువురు చర్చించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సినిమా నిర్మాణ రంగం అభివృద్ధి కోసం ప్రత్యేక దృష్టి సారించిందని, రాచకొండ లాంటి ప్రాంతాలు సినిమా షూటింగ్స్ కు ఎంతో అనువైనవి అని మహారాష్ట్ర మంత్రికి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వివరించారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మించిన రామోజీ ఫిలిం సిటీలో బాలీవుడ్, హాలీవుడ్ స్థాయి సినిమాలు నిర్మిస్తారని, హైదరాబాద్‌తో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న టూరిజం ప్రాంతాలు సినిమాలు నిర్మించేందుకు ఉత్తమ వేదికలుగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు.

తెలంగాణను హాలీవుడ్ స్థాయి ఫిల్మ్ హబ్‌గా డెవలప్మెంట్ చేస్తున్నామని వివరించారు. సినిమా పరిశ్రమకు ప్రత్యేక ప్రోత్సాహకాలు, రాయితీలు, సినీకార్మికుల సంక్షేమం లాంటి ప్రోత్సాహక కార్యక్రమాలకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. సినిమా పరిశ్రమ అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని మహారాష్ట్రలో కూడా ఇలాంటివి అమలు చేసేందుకు తెలంగాణ పర్యటనకు వచ్చినట్లు మహా రాష్ట్ర మంత్రి ఆశిష్ శెలార్ వివరించారు. మహారాష్ట్ర ఫిల్మ్ సిటీని విజిట్ చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని మహారాష్ట్ర మంత్రి ఆశిష్ శెలార్ ప్రత్యేకంగా ఆహ్వానించారు.

Next Story