- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హాలీవుడ్ స్థాయి ఫిల్మ్ హబ్‌గా తెలంగాణ.. కోమటిరెడ్డితో మహారాష్ట్ర మంత్రి ఆశిష్ శెలార్ భేటీ
తెలంగాణను హాలీవుడ్ స్థాయి ఫిల్మ్ హబ్ గా డెవలప్మెంట్ చేస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణను హాలీవుడ్ స్థాయి ఫిల్మ్ హబ్(Film Hub)గా డెవలప్మెంట్ చేస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) అన్నారు. శుక్రవారం సెక్రటేరియట్‌లో రాష్ట్ర రోడ్లుభవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో మహారాష్ట్ర ఐటీ, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి ఆశిష్ శెలార్ (Maharashtra Minister Ashish Shelar) భేటీ అయ్యారు. సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలసీ అంశాలపై ఇరువురు చర్చించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం సినిమా నిర్మాణ రంగం (Film industry) అభివృద్ధి కోసం ప్రత్యేక దృష్టి సారించిందని ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. రాచకొండ లాంటి ప్రాంతాలు సినిమా షూటింగ్స్‌కు ఎంతో అనువైనవి అని, ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మించిన రామోజీ ఫిలిం సిటీలో బాలీవుడ్, హాలీవుడ్ స్థాయి సినిమాలు నిర్మిస్తారని, హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న టూరిజం ప్రాంతాలు సినిమాలు నిర్మించేందుకు ఉత్తమ వేదికలుగా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు.
సినిమా పరిశ్రమకు ప్రత్యేక ప్రోత్సాహకాలు, రాయితీలు, సినీ కార్మికుల సంక్షేమం లాంటి ప్రోత్సాహక కార్యక్రమాలకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. సినిమా పరిశ్రమ అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని, మహారాష్ట్రలో కూడా ఇలాంటివి అమలు చేసేందుకు తెలంగాణ పర్యటనకు వచ్చినట్లు మహారాష్ట్ర మంత్రి ఆశిష్ శెలార్ వివరించారు. ఇక, మహారాష్ట్ర ఫిల్మ్ సిటీని విజిట్ చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని మహారాష్ట్ర మంత్రి ఆశిష్ శెలార్ ప్రత్యేకంగా ఆహ్వానించారు.






