- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అట్టహాసంగా మహంకాళి బోనాలు.. మరికాసేపట్లో రంగం, భవిష్యవాణి
సికింద్రాబాద్ (Secunderabad) ఉజ్జయినీ మహంకాళి బోనాలు ఆదివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.

దిశ, వెబ్‌డెస్క్: సికింద్రాబాద్ (Secunderabad) ఉజ్జయినీ మహంకాళి బోనాలు ఆదివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం తరపున మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) దంపతులు అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కూడా ఈ ఉత్సవాలకు హాజరై ఉజ్జయినీ మహంకాళి దేవికి పట్టు వస్త్రాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఇక దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ (Konda Surekha) బోనమెత్తారు. నిత్యం అధికారులతో సమన్వయం చేసుకుంటూ బోనాల ఉత్సవాన్ని దిగ్విజయం చేసేందుక తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఉదయం ఉదయం 9 గంటలకు రంగం, భవిష్యవాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. పచ్చికుండపై నిలబడి మాతంగి స్వర్ణలత భవిష్యవాణి చెప్పనున్నారు. ఇప్పటికే ఆమె ఆలయానికి చేరుకున్నారు. అనంతరం ఆలయ మూలవిరాట్ మహంకాళి అమ్మవారిని అంబారీపై ఊరేగించనన్నారు. సాయంత్రం ఫలహార బండ్ల ఊరేగింపు ఘనంగా నిర్వహించనున్నారు. అయితే, రంగం కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ పాల్గొనన్నారు.






