- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హిల్ట్ పాలసీకి వ్యతిరేకంగా ఈనెల 7న మహాధర్నా : బీజేపీ చీప్ రాంచందర్‌రావు
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన హిల్ట్ పాలసీ ద్వారా హైదరాబాద్ లోవిలువైన పారిశ్రామిక భూములను రియల్ఎస్టేట్సంస్థలకు అప్పగించే ప్రయత్నం చేస్తుందని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్‌రావు ఆరోపించారు.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన హిల్ట్ పాలసీ ద్వారా హైదరాబాద్ లోవిలువైన పారిశ్రామిక భూములను రియల్ఎస్టేట్సంస్థలకు అప్పగించే ప్రయత్నం చేస్తుందని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్‌రావు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు నిరసనగా ఈనెల 7న ఇందిరా పార్క్ వద్ద మహా ధర్నా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. సోమవారం రాష్ట్ర గవర్నర్జిష్ణుదేవ్వర్మను కలిసి పాలసీపై వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఈ పాలసీ అమలుతో అనేక మందికి తీవ్రమైన నష్టం జరుగుతుందని ల్యాండ్ కన్వర్షన్ పేరుతో తీసుకొచ్చిన ఈ పాలసీతో ప్రజాధనం లూటీ జరుగుతుందన్నారు. దాదాపు 9 వేల ఎకరాలకు పైగా పారిశ్రామిక భూమిని రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసం మలచుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది.
దీంతో కోట్లాది రూపాయల ప్రజా సంపదకు అపరిమిత నష్టం జరుగుతుంది, భారీ కుంభకోణానికి మార్గం సుగమం అవుతోందన్నారు. హిల్ట్ పాలసీ ద్వారా ప్రభుత్వం ఖజానా నింపుకునే ప్రయత్నం చేస్తున్న సమయంలో మా ఆందోళనను గవర్నర్ తెలిపామన్నారు. గతంలో పరిశ్రమలకు కేటాయించిన ఈ భూములు అప్పటి పరిస్థితుల్లో చాలా తక్కువ ధరలకు కట్టబెట్టారని, నేటి మార్కెట్ పరిస్థితులను పరిశీలిస్తే సబ్-రిజిస్ట్రార్ రేట్లు అసలు మార్కెట్ విలువలతో పోల్చితే చాలా తక్కువగా ఉందన్నారు. ఇటీవలే హైదరాబాద్ పరిసరాల్లో ఒక ప్రైవేట్ సంస్థ ఒక ఎకరం రూ.150 కోట్లకు కొనుగోలు చేసింది. ఇలా భూముల నిజమైన మార్కెట్ ధరలు ఆకాశాన్ని తాకుతున్న సందర్భంలో, హిల్ట్ పాలసీ ప్రకారం ఇండస్ట్రీయల్ భూములను కేవలం ఎస్ఆర్ఓ రేట్లలో 30శాతం మాత్రమే చెల్లించి కన్వర్ట్ చేసుకునే అనుమతి ఇవ్వడం తీవ్రమైన అనుమానాలకు దారితీస్తోందన్నారు.
ప్రస్తుతం నడుస్తున్న పరిశ్రమలు కూడా ఈ స్కీమ్‌లోకి చేరే అవకాశం ఉందని ఇది జరిగితే, అక్కడ పనిచేస్తున్న సిబ్బంది, కార్మికులు వేల సంఖ్యలో తమ ఉద్యోగాలను కోల్పోయే ప్రమాదం ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే ప్రాంతంలో ఉన్న రైతులు తమ భూములను కూడా మల్టీపర్పస్‌గా కన్వర్ట్ చేయమని ఎన్నేళ్లుగా కోరుతున్న వారి అభ్యర్థనలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. రైతుల భూములు మాత్రం ఏళ్లతరబడి పెండింగ్‌లో పడేయగా, పరిశ్రమల భూములు మాత్రమే రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసం వెంటనే కన్వర్ట్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. రైతుల హక్కులను పట్టించుకోకుండా, కార్మికుల భవిష్యత్తును ప్రమాదంలో పడేసి, రియల్ ఎస్టేట్ వ్యాపారాలకే ప్రాధాన్యత ఇచ్చేలా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోందా, నిజంగా పరిపాలన చేస్తుందా అనేది ప్రజలు ఆలోచించాలని సూచించారు.
ప్రజల మీద భారీ భారం మోపే విధానాలు, పారదర్శకత లేని నిర్ణయాలు, హిల్ట్ పాలసీలతో ప్రభుత్వం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా, పూర్తిగా వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని నిరూపిస్తున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల ప్రచారంలో చెప్పిన ఆరు గ్యారెంటీలు, 420 వాగ్దానాలు మాటలకే పరిమితమయ్యాయి. ఒక్క గ్యారంటీ కూడా అమలు చేయలేదన్నారు. హైదరాబాద్ ప్రజల హక్కులు, భవిష్యత్తు రక్షణ కోసం జరగబోయే ఈ పోరాటంలో అందరూ తప్పకుండా పాల్గొనాలని కోరారు.ఈ బృందంలో ఎమ్మెల్సీలు అంజిరెడ్డి , మల్క కొమురయ్య , ప్రధాన కార్యదర్శులు గౌతం రావు, వీరేందర్ గౌడ్, వేముల అశోక్ , జీహెచ్ఎంసీ బిజెపి ఫ్లోర్ లీడర్ శంకర్ యాదవ్ , డిప్యూటీ ఫ్లోర్ లీడర్ రాధా ధీరజ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






