Harsha Sai : మరో స్కాంలో యూట్యూబర్ హర్షసాయి!

by Muthe.Rajitha |

తెలుగు టాప్ యూట్యూబర్ హర్షసాయి(Youtuber Harsha Sai) మరో స్కాంలో ఇరుక్కున్నాడని సమాచారం.

Harsha Sai : మరో స్కాంలో యూట్యూబర్ హర్షసాయి!
X

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు టాప్ యూట్యూబర్ హర్షసాయి(Youtuber Harsha Sai) మరో స్కాంలో ఇరుక్కున్నాడని సమాచారం. సహాయం చేస్తామని నమ్మించి హర్షసాయి మనుషులు భారీగా డబ్బులు కాజేసినట్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే మహబూబ్ నగర్(Mahabubnagar) జిల్లాలోని మిడ్జిల్ మండల కేంద్రంలోని బరిగెల ఆంజనేయులు తండ్రి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. తండ్రి చికిత్సకు అప్పులు అవడంతో సహాయం చేయాలని హర్ష సాయి ఇన్స్టా ఇన్బాక్స్ లో మెసేజ్ పెట్టాడు. ఇదే అదనుగా భావించిన దుండగులు హర్షసాయి ఆఫీస్ నుండి మాట్లాడుతున్నామని రూ.4 లక్షల సహాయం చేస్తామని ఇన్‌స్టా లో ఆంజనేయులును నమ్మించారు. డాక్యుమెంట్ చార్జెస్, ఆఫీస్ బ్యాక్ ఎండ్ చార్జెస్ ఉంటాయని అవి మీరు రెడీ చేసుకొని.. మేము ఇచ్చిన నెంబర్‌కు మీరు ఫోన్ పే చేస్తే.. ఆ మరుక్షణమే హర్ష సాయి టీం మీకు ఫోన్ పే ద్వారా ఆర్థిక సహాయాన్ని పంపుతారని నమ్మబలికారు.

ఇది నమ్మిన ఆంజనేయులు మంగళవారం సాయంత్రం వారిచ్చిన ఫోన్ నెంబర్‌కు ఐదు సార్లు 22వేల 500లను వారికి ఫోన్ పే ద్వారా పంపారు. సహాయం కోసం ఆంజనేయులు మళ్ళీ ఫోన్ చేస్తే కేవలం 5500 ఫోన్ పే చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో మోసపోయానని గ్రహించిన ఆంజనేయులు పోలీసులను సంప్రదించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డ ఘటనలో హర్షసాయిపై ఇది వరకే కేసు నమోదు అయిన విషయం తెలిసిందే.

Next Story