- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, నవాబుపేట : ఎస్సీ రిజర్వేషన్ కల్పించాలని కొల్లూరు గ్రామపంచాయతీ గ్రామపంచాయతీ కార్యాలయం ముందు మంగళవారం ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన యువకులు ధర్నా చేశారు. తమ గ్రామంలో సుమారు రెండు వేల ఎస్సీల జనాభా ఉన్నప్పటికీ.. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి నేటి వరకు తమ గ్రామంలో ఎస్సీలకు సర్పంచ్ గా, ఎంపీటీసీగా పోటీ చేసే అవకాశం రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ రిజర్వేషన్ అమల్లో అవకతవకల కారణంగానే తమ సామాజిక వర్గానికి సర్పంచ్ గా, ఎంపీటీసీగా పోటీ చేసేందుకు అవకాశం రావడం లేదని వారు ఆరోపించారు. ఎస్సీ రిజర్వేషన్ సక్రమంగా అమలు కాకపోవడం వల్ల తాము రాజకీయంగా తీవ్రంగా నష్టపోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం తమకు తగిన న్యాయం చేయాలని గ్రామంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఆర్డీవో నవీన్ కి, నవాబ్ పేట తహశీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో జయరాం నాయక్ లకు వినతి పత్రాలు సమర్పించారు. కార్యక్రమంలో ఎస్సీలు పోచయ్య, బాల కిష్టయ్య, ఆంజనేయులు, జగన్, వెంకటయ్య, గణేష్, మల్లేష్, యాదయ్య, రాములు, జగన్మోహన్, బాలయ్య, నరేష్, పూర్ణయ్య, అంజయ్య పాల్గొన్నారు.






