వేస‌విలో వెంక‌టేశ్వ‌ర్ల బావి గ్రామంలో విద్యాభివృద్ధి పై యువ‌త ప్ర‌త్యేక శ్ర‌ద్ధ

by Ratna Kumari |

పల్లెలే పట్టుకొమ్మలు అన్నట్లుగా మహానుభావులు వివిధ సందర్భాలలో చెబుతుంటారు. ప్రస్తుతం నూతన సాంకేతిక సామాజిక అంశాలపై మాధ్యమాలలో మునిగిపోతూ ఈ సమాజానికి ఏమాత్రం ఉపయోగపడని అంశాలపై యువత పెడదోవ పడుతున్నారు.

వేస‌విలో వెంక‌టేశ్వ‌ర్ల బావి గ్రామంలో విద్యాభివృద్ధి పై యువ‌త ప్ర‌త్యేక శ్ర‌ద్ధ
X

దిశ, అచ్చంపేట : పల్లెలే పట్టుకొమ్మలు అన్నట్లుగా మహానుభావులు వివిధ సందర్భాలలో చెబుతుంటారు. ప్రస్తుతం నూతన సాంకేతిక సామాజిక అంశాలపై మాధ్యమాలలో మునిగిపోతూ ఈ సమాజానికి ఏమాత్రం ఉపయోగపడని అంశాలపై యువత పెడదోవ పడుతున్నారు. అయితే అందుకు భిన్నంగా నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం వెంకటేశ్వర్ల బావి గ్రామానికి చెందిన కొందరు యువకులు పై చెడు ప్రభావాన్ని చూపే వాటికి స్వస్తి పలుకుతూ.. అందుకు భిన్నంగా గ్రామంలో ఉన్న ప్రాథమిక స్థాయి విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీష్ తో పాటు గణితం సైన్స్ లాంటి వాటిపై మరింత పట్టు సాధించేలా జ్ఞానం పెంపొందించేలా వేసవి కాలంలో ప్రత్యేక చర్యలు చేపట్టారు. విద్యార్థుల తల్లిదండ్రులు వివిధ పరులకు వెళుతున్న నేపథ్యంలో ఇంటి వద్ద ఉన్న విద్యార్థులు వేసవిలో అటు ఇటు తిరుగుతూ కాలయాపన చేయకుండా గ్రామములో కొంతమంది యువకులు ముందుకు వచ్చి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఇలా గత మూడు రోజులుగా వారు చేస్తున్న ప్రయత్నం సఫలీకృతం అవుతుందని తృప్తి చెందుతున్నారు. స్థానిక అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో బాల బాలికలకు మెరుగైన విద్య అందించేలా యువత చేపడుతున్న ప్రయత్నానికి గ్రామంలోని విద్యార్థుల తల్లిదండ్రులు సహకరిస్తున్నారు.

మిగతా గ్రామాలకు ఆదర్శం

మండలంలోని మిగతా గ్రామాలకు వెంకటేశ్వర్లుభావి గ్రామం యువకులు చిన్నారులకు అందిస్తున్న ఆంగ్ల విద్యతో పాటు ఇతర సబ్జెక్టులలో ఒకటి నుండి పది తరగతుల విద్యార్థులకు మెలుకువలు నేర్పుతున్న తీరును మిగతా గ్రామాలకు నూతన ఆలోచన విధానంతో ముందుకు వెళుతున్నందుకు ప్రశంసలు అందుకుంటున్నారు. గ్రామానికి చెందిన కొందరు విద్యావంతులు వారు చేపడుతున్న విద్యా కార్యక్రమం ఇతరులకు ఆదర్శంగా నిలుస్తు మండలంలో ప్రశంసలు పొందుతున్నారు.

Next Story