యువ‌త చ‌దువుతో పాటు క్రీడ‌ల్లో రాణించాలి : ఎస్సై కురుమ‌య్య‌

by Ratna Kumari |

యువత చదువుతో పాటు తాము ఎంచుకున్న క్రీడా రంగంలో రాణించాలని ఎస్సై కురుమయ్య అన్నారు.

యువ‌త చ‌దువుతో పాటు క్రీడ‌ల్లో రాణించాలి : ఎస్సై కురుమ‌య్య‌
X

దిశ‌, పాన్ గ‌ల్ : యువత చదువుతో పాటు తాము ఎంచుకున్న క్రీడా రంగంలో రాణించాలని ఎస్సై కురుమయ్య అన్నారు. మండల పరిధిలోని బండపల్లి స్టేజి సమీపంలో నిర్వహించిన (జేబివీబి) జమ్మాపూర్, బహదూర్ గూడెం, వెంగలాయిపల్లి, బండపల్లి ఉమ్మడి గ్రామాల క్రికెట్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ క్రీడా పోటీలు యువతలో స్నేహభావాన్ని పెంపొందిస్తాయని అన్నారు. యువత చదువుతోపాటు క్రీడారంగంలో రాణించి గ్రామానికి, తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తిరుపతయ్య నాయుడు, బంగ్లా సుజీవన్, దర్గయ్య, గోవర్ధన్ రెడ్డి, యుగంధర్ నాయుడు, కుమార్ నాయుడు, క్రీడాకారులు, గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు.

Next Story