దేశ రక్షణలో యువత భాగస్వామ్యం కావడం అభినందనీయం

by Nallavelli.Anjaneyulu |

అహర్నిశలు దేశ రక్షణ కోసం పాటుపడుతున్న జవాన్ల సేవలు వెలకట్టలేనివని సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్, మాజీ సర్పంచ్ యెన్నం భూపతి రెడ్డి, ఆర్య వైశ్య మహాసభ జిల్లా అధ్యక్షులు బచ్చు రామకృష్ణ లు అన్నారు.

దేశ రక్షణలో యువత భాగస్వామ్యం కావడం అభినందనీయం
X

దిశ, వెల్దండ : అహర్నిశలు దేశ రక్షణ కోసం పాటుపడుతున్న జవాన్ల సేవలు వెలకట్టలేనివని సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్, మాజీ సర్పంచ్ యెన్నం భూపతి రెడ్డి, ఆర్య వైశ్య మహాసభ జిల్లా అధ్యక్షులు బచ్చు రామకృష్ణ లు అన్నారు. గురువారం మండల కేంద్రంలోనీ గ్రామ పంచాయతీ అవరణలో సర్పంచ్ ఆధ్వర్యంలో మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు మట్ట చంద్రశేఖర్ గౌడ్ అధ్యక్షతన ఆర్మీ డే నిర్వహించిన కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశసేవ చేయడం గొప్ప వరమని, ఇలాంటి అవకాశం అందరికి రాదన్నారు. జవాన్లు కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ ఎండ, వాన, చలిని లెక్క చేయకుడా తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి దేశసేవ చేస్తున్నారని పేర్కొన్నారు. నిత్యం లక్షల మంది సైనికులు కంటికి రెప్పలా దేశాన్ని కాపడుతుంటారని, వారి త్యాగలవల్లే నేడు మనం ప్రశాంత జీవనం గడుపుతున్నామని పేర్కొన్నారు. మండల కేంద్రంలో ఎక్కువగా ఆర్మీలో యువత భాగస్వామ్యం కావడం అభినందనీయం అన్నారు. అనంతరం సైనికులకు, మాజీ సైనికులకు, వారి కుటుంబ సభ్యులకు శాలువాలతో సన్మానించి, ఆ సంఘం నూతన కాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బస్నమోని శ్రీను ముదిరాజ్, మాజీ సైనికులు సంఘం ఉపాధ్యక్షుడు పురుషోత్తమ చారి, పీఏసీఎస్ మాజీ వైస్ చైర్మన్ సంజీవ్ కుమార్ యాదవ్, బీజేపీ సీనియర్ నాయకులు చిందం కృష్ణయ్య, మట్ట మదన్ గౌడ్, వార్డు సభ్యులు క్రిస్టల్, పుల్లయ్య, శ్రీనివాస్ పాల్గొన్నారు.

Next Story