ఆన్ లైన్ యాప్ లో వేధింపులు.. యువకుడి ఆత్మహత్య

by Ratna Kumari |

పలు ఆన్ లైన్ యాప్ ల ద్వారా లోన్ తీసుకోవడంతో తిరిగి డబ్బులు చెల్లించాలంటూ ఆన్ లైన్ నిర్వాహకులు ఒత్తిడి చేయడంతో వేధింపులు భరించలేక ఓ యువకుడు ఆత్మహత్య కు పాల్పడ్డ ఘటన పాలమూరు జిల్లాలో చోటు చేసుకుంది.

ఆన్ లైన్  యాప్ లో వేధింపులు..  యువకుడి ఆత్మహత్య
X

దిశ, జడ్చర్ల : పలు ఆన్ లైన్ యాప్ ల ద్వారా లోన్ తీసుకోవడంతో తిరిగి డబ్బులు చెల్లించాలంటూ ఆన్ లైన్ నిర్వాహకులు ఒత్తిడి చేయడంతో వేధింపులు భరించలేక ఓ యువకుడు ఆత్మహత్య కు పాల్పడ్డ ఘటన పాలమూరు జిల్లాలో చోటు చేసుకుంది. జడ్చర్ల మండలం నసరులాబాద్ గ్రామానికి చెందిన తరుణ్ కుమార్(26) గత కొన్నేళ్లుగా జడ్చర్ల పట్టణ కేంద్రంలో సెలూన్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలో సెలూన్ సెంటర్ కోసం పలు ఆన్ లైన్ భారత్ పే, ఆదర్శ్ బ్యాంక్, ఫైవ్ స్టార్ బ్యాంక్, వంటి యాప్ ల ద్వారా రెండు ఏళ్ల క్రితం సుమారు 15 లక్షల వరకు లోన్ తీసుకున్నాడు. లోన్ ల ద్వారా తీసుకున్న అప్పులను తిరిగి చెల్లించకపోవడంతో ఆన్ లైన్ నిర్వాహకులు అప్పులు చెల్లించాలని నిత్యం వేధింపులకు గురి చేయడంతో ఆన్ లైన్ నిర్వాహకుల వేధింపులను భరించలేక తరుణ్ కుమార్ గత రాత్రి తాను నిర్వహిస్తున్న సెలూన్ సెంటర్లోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో విషయం తెలుసుకున్న కుటుంబీకులు ఘటన స్థలానికి చేరుకొని తన కుమారుడి మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. మరోవైపు తరుణ్ ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకొని సంబంధిత ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా తరుణ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జడ్చర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే ఆన్లైన్ యాప్ ల నిర్వాహకుల వేధింపును భరించలేకనే తమ కుమారుడు మృతి చెందాడని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

Next Story