చికిత్స పొందుతూ యువతి మృతి

by Ratna Kumari |

తెలకపల్లి చికిత్స పొందుతూ యువతి మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది.

చికిత్స పొందుతూ యువతి మృతి
X

దిశ, తెలకపల్లి : తెలకపల్లి చికిత్స పొందుతూ యువతి మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై బి. నరేష్ అందించిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని గోలగుండం గ్రామానికి చెందిన వడ్డేమాన్ భార్గవి(21) అనే యువతికి ఈనెల 15న తండ్రి ఆమెకు వివాహ నిశ్చయం కోసం తెలకపల్లి మండల కేంద్రానికి చేరుకోగా అదే రోజు సాయంత్రం భార్గవి క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ఇది గమనించిన గ్రామానికి చెందిన కడెం శివ, భార్గవి తండ్రికి సమాచారం ఇవ్వడంతో వెంటనే గ్రామానికి చేరుకుని చికిత్స నిమిత్తం భార్గవిని నాగర్ కర్నూల్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు. భార్గవికి లింగాల మండలం కోమటికుంట గ్రామానికి చెందిన కడెం బాలకృష్ణతో సన్నితంగా ఉన్నట్లు మృతురాలి తండ్రి వడ్డేమాన్ పాపయ్య అనుమానం వ్యక్తం చేసి ఫిర్యాదు చేసినట్లు ఎస్సై తెలిపారు. మృతురాలు తండ్రి వడ్డేమాన్ పాపయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బి నరేష్ తెలిపారు.

Next Story