ప్రేమించిన వ్య‌క్తి పెళ్లికి ఒప్పుకోలేద‌ని యువ‌తి ఆత్మ‌హత్య

by Nallavelli.Anjaneyulu |

ప్రేమించిన వ్య‌క్తి పెళ్లికి ఒప్పుకోలేద‌ని ఓ యువ‌తి ఆత్మ‌హ‌త్య చేసుకున్న సంఘ‌ట‌న జోగులాంబ గ‌ద్వాల జిల్లాలోని గ‌ట్టు మండ‌లం చిన్నోని

ప్రేమించిన వ్య‌క్తి పెళ్లికి ఒప్పుకోలేద‌ని యువ‌తి ఆత్మ‌హత్య
X

దిశ‌, గ‌ట్టు : ప్రేమించిన వ్య‌క్తి పెళ్లికి ఒప్పుకోలేద‌ని ఓ యువ‌తి ఆత్మ‌హ‌త్య చేసుకున్న సంఘ‌ట‌న జోగులాంబ గ‌ద్వాల జిల్లాలోని గ‌ట్టు మండ‌లం చిన్నోనిప‌ల్లిలో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్లితే.. ఖ‌మ్మం జిల్లాకు చెందిన ప్రియాంక హైద‌రాబాద్ లో పోలీస్ ఉద్యోగం కోసం శిక్ష‌ణ తీసుకుంది. అదే స‌మ‌యంలో జోగులాంబ గ‌ద్వాల జిల్లాకి చెందిన ర‌ఘు గౌడ్ ప‌రిచ‌యం అయ్యాడు. వారిద్ద‌రి మ‌ధ్య ఏర్ప‌డిన ప‌రిచ‌యం కాస్త ప్రేమ‌గా మారింది. వీరిద్ద‌రూ పెళ్లి చేసుకున్నారు. అయితే ర‌ఘుగౌడ్ కి కానిస్టేబుల్ ఉద్యోగం రాగానే పెళ్లి కి నో చెప్పాడు. దీంతో ప్రియాంక గ‌ద్వాల జిల్లా చిన్నోన‌ప‌ల్లి గ్రామంలోని ర‌ఘుగౌడ్ ఇంటి ముందు గ‌త మూడు నెల‌లుగా నిర‌స‌న చేస్తూ వ‌చ్చింది. పోలీసులు ర‌ఘు గౌడ్ పై కేసు నమోదు చేయ‌డంతో పాటు జైలుకు కూడా వెల్లి వ‌చ్చాడు. అయిన‌ప్ప‌టికీ అత‌నిలో మాత్రం మార్పు రాలేదు. దీంతో విర‌క్తి చెందిన ప్రియాంక రఘు గౌడ్ ఇంటి ముందు గ‌డ్డి మందు తాగి ఆత్మ‌హ‌త్య‌య‌త్నానికి పాల్ప‌డింది. శ‌నివారం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ మ‌ర‌ణించింది. ప్రియాంక మ‌ర‌ణానికి కార‌కులైన ర‌ఘుగౌడ్ పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప్రియాంక బంధువులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story