పురుగుల అన్నం తినలేం.. విద్యార్థినీల గళం

by Ratna Kumari |

దిశ, కల్వకుర్తి : పురుగుల అన్నం..నీళ్ల చారు...అర కోర కూరలతో తాము తినలేమంటూ కల్వకుర్తి గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. బుధవారం అందించిన

పురుగుల అన్నం తినలేం.. విద్యార్థినీల గళం
X

దిశ, కల్వకుర్తి : పురుగుల అన్నం..నీళ్ల చారు...అర కోర కూరలతో తాము తినలేమంటూ కల్వకుర్తి గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. బుధవారం అందించిన అన్నం, చికెన్ కర్రీలో పురుగులు రావడంతో విద్యార్థినులంతా తినకుండా ప్లేట్లను పక్కన పెట్టారు. పాటశాల ఆవరణలో బైటయించి నిరసన తెలిపారు. ఆశ్రమ పాటశాలలో దాదాపు 350 విద్యార్థులు లోపు విద్యార్థులకు సరైన భోజనం లేక విలవిలలాడుతున్నారు. మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని, నాసిరకం కూరగాయలతో వంటలు చేస్తున్నారని విద్యార్థులు తెలిపారు. గత 35 రోజుల నుండి పాటశాలలో పనిచేసే వంట కార్మికులు జీతాలు రావడం లేదని సమ్మెకు దిగి పాటశాలకు రాకపోవడంతో కొన్ని రోజులు విద్యార్థులే వంట మనుషులుగా మారి వంట చేసుకున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. వీరిలో చిన్నారులు ఉండటం ద్వార ఆకలికి అలమటిస్తున్నారని తెలిసి పెద్ద తరగతి విద్యార్థులు వంట చేసి పెట్టారు.


ఆ క్రమంలోనే పాటశాల సిబ్బంది విద్యార్థుల ఇబ్బందులు చూసి ప్రైవేట్ వ్యక్తులతో వంటలు చేపిస్తున్నట్టు సమాచారం. పాటశాల ఆవరణలో కుక్క చనిపోయి 15 రోజులు గడుస్తున్నా పట్టించుకునే నాథుడే లేరని, ఆఖరికి మేమే తీసామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. పిచ్చి మొక్కలతో ఆవరణ అపరిశుభ్రతకు లోనైందని, పాములు దోమలతో ప్రతిరోజు సతమతమవుతున్నామన్నారు. ఇంటి నుండి తెచ్చుకున్న తినుబండారాలతో కాలం వెల్లదీస్తున్నామని పాటశాల విద్యార్థులు అన్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎబివిపి విద్యార్ధి సంఘం నాయకులు వంశీ వారి అనుచరగణంతో అక్కడి వెళ్లి విద్యార్థుల సమస్యలు తెలుసుకొని వారికి మద్దతు పలికారు. అదే క్రమంలో జిల్లా డిటిడిఓ పిరంగి ఆశ్రమ పాటశాలను తనిఖీ చేసే క్రమంలో విద్యార్థులు తినే చికెన్ కూరలో బొద్దింకలు, పురుగులు రావడంతో అధికారికి చూపించి తమ ఆవేదనను నిరసన ద్వార వ్యక్త పరిచారు. మరల తప్పిదం జరగకుండా చూసుకుంటానని ఆయన హామీ ఇచ్చారనీ సమాచారం. విద్యార్థుల మౌలిక వసతుల విషయంలో ఇబ్బందులకు గురిచేస్తే ఏబీవీపీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకోలు చేస్తామని విద్యార్ధి సంఘ నాయకులు అన్నారు.

Next Story