- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మక్తల్ లో ఓటేసిన డబ్ల్యూటీఐటీసీ అధ్యక్షుడు
మక్తల్ పట్టణంలో బాలుర హై స్కూల్ 178 పోలింగ్ బూతులు వరల్డ్ తెలుగు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కౌన్సిల్ (డబ్ల్యూటీఐటీసీ), జై మఖ్తల్ ట్రస్ట్ ఛైర్మన్ సందీప్ కుమార్ దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు.

దిశ, మక్తల్ : మక్తల్ పట్టణంలో బాలుర హై స్కూల్ 178 పోలింగ్ బూతులు వరల్డ్ తెలుగు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కౌన్సిల్ (డబ్ల్యూటీఐటీసీ), జై మఖ్తల్ ట్రస్ట్ ఛైర్మన్ సందీప్ కుమార్ దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. తమ పూర్వీకుల ప్రాంతమైన మక్తల్ లో తొలిసారి ఓటు హక్కు వినియోగించుకొవడం తన అత్యంత సంతోషకరమైన దినమని జీవితంలో మరిచిపోలేనని సందీప్ కుమార్ మఖ్తల తెలిపారు.
మక్తల్ పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో తన సతీమణి భాగ్యలక్ష్మి సైతం ఓటు హక్కును వినియోగించుకుమన్నారు. తమకు మక్తల్ నియోజకవర్గంతో విడదీయలేని బంధం ఉందని, నియోజకవర్గ అభివృద్ధి కోసం కలిసికట్టుగా తన వంతు కృషి చేద్దామన్నారు. నియోజకవర్గంలో యువకుల సంఖ్య చాలా ఎక్కువగా ఉందని, భవిష్యత్తులో యువతే కీలకం కానుందని తెలిపారు. యువకులు మరింతగా రాణించేందుకు కృషి చేయాలని, అన్నివిధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.






