- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కంగారు పడకుండా పదో తరగతి పరీక్షలు రాయండి
ఎలాంటి కంగారు లేకుండా పదోతరగతి పబ్లిక్ పరీక్షలు రాసి ఉత్తమ ఫలితాలు సాధించాలని ఎస్పీ జానకి ఆకాంక్షించారు.

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : ఎలాంటి కంగారు లేకుండా పదోతరగతి పబ్లిక్ పరీక్షలు రాసి ఉత్తమ ఫలితాలు సాధించాలని ఎస్పీ జానకి ఆకాంక్షించారు. బుధవారం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, మహాత్మా గాంధీ రోడ్ పరీక్షా కేంద్రాన్ని ఆమె సందర్శించి మాట్లాడారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళన లేకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయడానికి పోలీసులు అన్ని విధాల భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు, అలాగే పరీక్షా కేంద్రాల వద్ద ట్రాఫిక్ సమస్యలు రాకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల సమీపంలో ఉన్న జీరాక్సు సెంటర్లు పరీక్షల సమయంలో తెరిచి ఉంచరాదని, పరీక్షా కేంద్రాల వద్ద ప్రజలు గుమిగూడకుండా చూడాలని సూచించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కూడా పరీక్షా కేంద్రాల వద్ద అనవసరంగా నిలబడకుండా సహకరించాలని ఎస్పీ జానకి కోరారు.






