- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వేరు శనగ విత్తనాలు పంపిణీ చేయాలని రైతులు రాస్తారోకో
దిశ, పాన్ గల్ : కేంద్ర ప్రభుత్వం రైతులకు నాబార్డ్ సహకారంతో రైతులకు 100 శాతం సబ్సిడీపై పంపిణీ చేస్తున్న వేరుశనగ విత్తనాలను మండలంలోని రైతులకు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం

దిశ, పాన్ గల్ : కేంద్ర ప్రభుత్వం రైతులకు నాబార్డ్ సహకారంతో రైతులకు 100 శాతం సబ్సిడీపై పంపిణీ చేస్తున్న వేరుశనగ విత్తనాలను మండలంలోని రైతులకు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం రైతులు అంబేద్కర్ చౌరస్తాలో ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులనుద్దేశించి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి సుబ్బయ్య యాదవ్, గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి బాల్యా నాయక్ లు రాస్తారోకోకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం నాబార్డ్ సహకారంతో రైతులకు 100 శాతం సబ్సిడీతో వేరుశనగ విత్తనాలను పంపిణీ చేయడం హర్షనీయమన్నారు. కానీ అధికారులు ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతో అర్హులైన రైతులకు సబ్సిడీ విత్తనాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీ నాయకులు సూచించిన వారికే అధికారులు ప్రాధాన్యమిస్తూ విత్తనాలు పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. అర్హులైన రైతులకు పంపిణీ చేయాల్సిన వేరుశనగ విత్తనాలను పక్కదారి పట్టిస్తూ రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఎక్సైజ్ అండ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించి వ్యవసాయాన్ని నమ్ముకుని ఆరు గాలం కష్టపడే రైతులకు వేరుశనగ విత్తనాలు పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. రైతులు రాస్తారోకో చేపడుతున్న సమాచారం తెలుసుకున్న మండల వ్యవసాయ అధికారి మణిచందర్ హెడ్ కానిస్టేబుల్ యాదగిరి సంఘటన స్థలానికి చేరుకొని రైతులను శాంతింపజేశారు. అనంతరం మండలానికి కేటాయించిన వేరుశనగ విత్తనాలను పంపిణీ చేశారు. అవసరమైన రైతులకు పంపిణీ చేసేందుకు మండలానికి వేరుశనగ విత్తనాలను కేటాయించాలని ప్రభుత్వానికి నివేదిక అందజేసి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.






