- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నల్లమలలో ప్రపంచ వన్యప్రాణి వారోత్సవ వేడుకలు
దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ రిజర్వ్ టైగర్ నల్లమల ఫారెస్ట్ ఏరియాలో సోమవారం ప్రపంచ వన్యప్రాణి వారోత్సవాలు

దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ రిజర్వ్ టైగర్ నల్లమల ఫారెస్ట్ ఏరియాలో సోమవారం ప్రపంచ వన్యప్రాణి వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్రాబాద్ ఫారెస్ట్ డివిజన్ ఆధ్వర్యంలో అవగాహన, బైకు ర్యాలీ నిర్వహించారు. మన్ననూర్ చెక్ పోస్ట్ వద్ద నుంచి ధుర్వసుల చెక్ పోస్ట్ వరకు బైకు ర్యాలీ నిర్వహించి వన్యప్రాణి సంరక్షణ పై ప్రజల్లో అవగాహన కల్పించారు. అలాగే ధుర్వసుల చెక్ పోస్ట నుంచి పరహాబాద్ బేస్ క్యాంపు వరకు పరిశుభ్రత కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎఫ్డిఓ రామ్మూర్తి మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణతో పాటు వన్యప్రాణుల సంరక్షణ కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని ప్రధానంగా ప్లాస్టిక్ నిషేధ ఆజ్ఞలు యాత్రికులు ప్రజలు తూచా తప్పకుండా పాటించాలని సూచించారు. వన్యప్రాణి వారోత్సవం సందర్భంగా రాబోయే రోజుల్లో పాఠశాల విద్యార్థుల కోసం వ్యాసరచన, చిత్రలేఖన పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. అలాగే వన్యప్రాణి సఫారీ కార్యక్రమం కూడా నిర్వహించనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో అమ్రబాద్ డివిజన్ ఫీల్డ్ సిబ్బంది, క్షేత్రాధికారి వీరేష్, అమ్రాబాద్, మన్నానూరు, మద్ది మడుగు రేంజ్ సిబ్బంది పాల్గొన్నారు.






