కార్యకర్తల కోసం క‌ష్ట‌ప‌డ‌తా

by Bhanu |   (  Updated:2025-11-28 14:08:44  IST  )

కార్య‌క‌ర్త‌ల కోసం నిత్యం క‌ష్ట‌ప‌డి ప‌నిచేస్తాన‌ని, కాంగ్రెస్ భార‌సల వ‌ల్ల ప్ర‌జ‌ల‌కు ఒరిగేదేమి లేద‌ని ఎంపీ ఈటెల రాజేంద‌ర్ పేర్కొన్నారు.

కార్యకర్తల కోసం క‌ష్ట‌ప‌డ‌తా
X

దిశ,కమలాపూర్ : కార్య‌క‌ర్త‌ల కోసం నిత్యం క‌ష్ట‌ప‌డి ప‌నిచేస్తాన‌ని, కాంగ్రెస్ భార‌సల వ‌ల్ల ప్ర‌జ‌ల‌కు ఒరిగేదేమి లేద‌ని ఎంపీ ఈటెల రాజేంద‌ర్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే, ఎంపీ ఎలక్షన్లో మా కోసం పని చేసే గ్రామ కార్యకర్తల కోసం స్థానిక ఎన్నికల్లో పనిచేస్తానంటూ హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో శుక్రవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 25 సంవత్సరాలుగా నియోజకవర్గంలోని ప్రజలకు ఈటల అంటే ఏంటో తెలుసని, కార్యకర్తల కోసం తానే స్వయంగా స్థానిక ఎన్నికల్లో తను బలపరిచిన అభ్యర్థులకు ప్రచారం నిర్వహించి ఓటు వేయాల్సిందిగా ప్రజలను కోరుతునన్నారు. రాష్ట్రంలో గ్రామాలకు రాష్ట్ర పరంగా నిధులు లేవని స్థానిక ఎన్నికల్లో బిఆర్ఎస్, కాంగ్రెస్ గెలిస్తే ఒక్క రూపాయి కూడా వచ్చేది లేదని, కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని రెండు పార్టీలు ఒకటే అని విమర్శించారు. కేంద్రపరంగా గ్రామపంచాయతీలకు నిధులు వస్తాయని, రోడ్లు, కాలువలు, వీధి దీపాల వివిధ గ్రామ పంచాయతీ అభివృద్ధి పనులకు కేంద్రం నిధులు మంజూరు చేస్తుందని గ్రామ ప్రజలకు తెలుసు అన్నారు. కేంద్రం నుండి గ్రామపంచాయతీలకు వచ్చే నిధులతో గ్రామాలను అభివృద్ధి జరిపించే బాధ్యత తనదని ఈటల హామీ ఇచ్చారు. సాధ్యమైనంత వరకు గ్రామాల్లో పార్టీ తరపున ఒకరి కంటే ఎక్కువ పోటీదారులు లేకుండా ప్రయత్నం చేస్తున్నామన్నారు. గ్రామ పంచాయతీలకు నిధులు రావాలన్నా, గ్రామాలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలన్న,గ్రామపంచాయతీ సిబ్బందికి జీతాలు రావాలన్నా బిజెపి పార్టీ అభ్యర్థులను, బలపరిచిన వ్యక్తులను ఆశీర్వదించి గెలిపించాలని కోరారు.

Next Story