మున్సిప‌ల్ కార్మికుల నిర్ల‌క్ష్యం.. అమరగిరి రోడ్డుపై 'చెత్త డంప్'

by Ratna Kumari |

దిశ, కొల్లాపూర్ : కొల్లాపూర్ పట్టణం నుంచి అమరగిరి పర్యాటక ప్రాంతానికి వెళ్లే రహదారిని పారిశుధ్య కార్మికులు చెత్తడంపు గా మార్చేశారు. నల్లమల కొండల సరిహద్దులో

మున్సిప‌ల్ కార్మికుల నిర్ల‌క్ష్యం.. అమరగిరి రోడ్డుపై చెత్త డంప్
X

దిశ, కొల్లాపూర్ : కొల్లాపూర్ పట్టణం నుంచి అమరగిరి పర్యాటక ప్రాంతానికి వెళ్లే రహదారిని పారిశుధ్య కార్మికులు చెత్తడంపు గా మార్చేశారు. నల్లమల కొండల సరిహద్దులో భారీ డంపింగ్ యార్డును ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ అక్కడి డంపింగ్ యార్డులోకి చెత్తను వాహనాల్లో తీసుకెళ్లి డంప్ చేయాల్సి ఉండగా.. మున్సిపల్ కార్మికులు నిర్లక్ష్యం తో చెత్తను మార్గమద్యం లోనే రోడ్డు అంచున డంప్ చేశారు. దీంతో ప్రతి నిత్యం వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్ ల్లో అమరగిరి పర్యాటక ప్రదేశానికి వస్తుంటారు. పట్టణంలోని చెత్త చెదారాన్ని తీసుకొచ్చి రోడ్డు అంచున డంఫ్ చేయడంతో ఆ మార్గం లో రాకపోకలు చేసే బాట సారులు దుర్వాసనను తట్టుకోలేక పోతున్నారు. గతంలో కూడా మున్సిపల్ కార్మికులు చెత్తను ఇలాగే రోడ్డు పైనే డంపింగ్ చేయడం తో అమరగిరి వాసులు మున్సిపల్ అధికారుల కు ఫిర్యాదు చేయడం, పైగా పత్రికల్లో డోల్ల తనాన్ని ఎత్తి చాపడంతో అధికారులు స్పందించి రోడ్డు పై నుంచి చెత్తను తొలగించిన విషయం విధితమే. ఎందుకో మరి ఇక్కడ పని చేసే మున్సిపల్ కార్మికుల తీరు మాత్రం మారడం లేదని అమరగిరి గ్రామ ప్రజలు వాపోతున్నారు. ఇంత నిర్ల‌క్ష్యం ఎందుకు అని ఆ గ్రామ బీజేపీ నాయకుడు భరత్ యాదవ్ ప్రశ్నించారు. చెత్తగా మారిన అమరగిరి రహదారి పై వెళ్లే బాట సారులు, పర్యాటకులు దుర్వాసనతో అసౌకర్యం గురవుతున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్ స్పందించి రోడ్డు పైన డంప్ చేసిన చెత్త ను తొలగించాలని పర్యాటకులు అమరగిరి ప్రజలు కోరుతున్నారు.

Next Story