- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిబద్ధత, క్రమశిక్షణ తో పని చేయండి భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలవండి
నిబద్ధత క్రమశిక్షణ తో ప్రజలకు పని చేసి భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలవాలని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు.

దిశ, కొత్తకోట: నిబద్ధత క్రమశిక్షణ తో ప్రజలకు పని చేసి భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలవాలని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. కొత్తకోట మున్సిపల్ కార్యాలయం లో మంగళవారం నిర్వహించిన జనరల్ బాడీ సమావేశంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లతో కలసి దేవరకద్ర ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా డ్రైనేజీ, స్ట్రీట్ లైట్స్, ట్రాఫిక్, పారిశుద్ధ్య నిర్వహణ పనులు, సీసీ రోడ్లు, త్రాగునీరు, విద్యుత్, మౌలిక వసతులు తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.ఎన్నికల సమయంలో మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు, ప్రజల ఇబ్బందులు తీర్చడానికి నిరంతరం కృషి చేయండి, నా వంతు పూర్తి సహకారం అందజేస్తానని అన్నారు.
అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. కొత్తకోట మున్సిపాలిటీ అభివృద్ధికి సంబంధించి ఇటీవలే 17 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసుకున్నామని. మున్సిపాలిటీ అభివృద్ధికి సంబంధించి, నిన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారితో చర్చించడం జరిగింది, నిధులు కేటాయించడానికి ముఖ్యమంత్రి గారు సానుకూలత వ్యక్తం చేశారని చెప్పారు.వేసవిని దృష్టిలో ఉంచుకుని, నీటి సమస్యలు తలెత్తకుండా, అధికారులు, ప్రజాప్రతినిధులు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. రూ. 6 కోట్ల నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి, రూ.2 కోట్ల నిధులతో పార్కుల డెవలప్మెంట్ కు నిధులు మంజూరు చేశానని 1 కోటి, 50 లక్షల నిధులతో స్ట్రోమ్ వాటర్, డ్రైన్ల నిర్మాణానికి, 5 కోట్ల నిధులతో చేనగ చెరువు కట్ట పై, వెంకటగిరి రహదారిపై సంత బజార్ ఏర్పాటు చేయడంతో పాటు వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి బ్యూటీఫికేషన్ పనులు త్వరలో పనులు జరుగుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అరుణ శ్రీనివాస్, కమిషనర్ సైదయ్య, వైస్ చైర్మన్ పల్లవి కృష్ణారెడ్డి, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా అందజేత
రంజాన్ పండుగని పురస్కరించుకొని పట్టణంలోని ఖాద్రి మసీదులో ముస్లిం సోదరులతో కలసి ఎమ్మెల్యే ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. అనంతరం క్యూ ఆర్ ఫంక్షన్ హాల్ లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రంజాన్ తోఫాను ముస్లిం సోదరులకు అందజేశారు. అనంతరం విందులో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడుతూ. కులాలకు మతాలకు అతీతంగా జరుపుకునే పండుగ రంజాన్ పండుగని మైనార్టీ సోదరులు పండగను సుఖ సంతోషాలతో జరుపుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం పై మాపై అల్లా దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మైనార్టీ సోదరులు పాల్గొన్నారు.






