- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేయండి
బడిబాట కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రతి ఉపాధ్యాయుడు కృషి చేయాలని కలెక్టర్ ఖుష్బూ గుప్తా సూచించారు.

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : బడిబాట కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రతి ఉపాధ్యాయుడు కృషి చేయాలని కలెక్టర్ ఖుష్బూ గుప్తా సూచించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 'బడిబాట' కార్యక్రమం సందర్భంగా నవాబుపేట మండలం, మల్లారెడ్డిపల్లి ప్రైమరీ స్కూల్ ఉపాధ్యాయుడు తిరుమల నాగేంద్ర కుమార్ రచించి, పాడిన సిడీ ని, అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ తో కలిసి ఆమె ఆవిష్కరించి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, ప్రాధాన్యత, వనరులు, నాణ్యతతో పాటు, అలాగే విద్యా ప్రమాణాలు, సౌకర్యాలు, జీవన నైపుణ్యాలతో కూడిన విద్య, స్పోర్ట్స్, గేమ్స్, వ్యాయామం, యోగా, తదితర సాంస్కృతిక కార్యక్రమాలు తెలియజేసే ఈ సిడీ ని రచించి అద్భుతంగా పాడారని ఆమె ప్రశంసించారు. ఈ సిడి నుంచి వినిపిస్తూ విద్యార్థుల నమోదు వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా తిరుమల నాగేంద్ర కుమార్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు పి. మురళీకృష్ణ, రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఎంఎస్ విజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.






