- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నవజీవన స్థలంపై మహిళల పోరాటం
దిశ, మహమ్మదాబాద్ : మండల కేంద్రంలోని నవజీవన క్రియేషన్ స్థలం వద్ద జరుగుతున్న నిరసన కార్యక్రమంలో

దిశ, మహమ్మదాబాద్ : మండల కేంద్రంలోని నవజీవన క్రియేషన్ స్థలం వద్ద జరుగుతున్న నిరసన కార్యక్రమంలో ఆదివారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. మహిళా సమాఖ్యకు స్థలం కేటాయించాలని గ్రామస్తులు వారం రోజులుగా చేపట్టిన ఆందోళన చిన్నపాటి తోపులాటలకూ దారి తీసింది. సుమారు 300 మంది నిరసనకారులు టెంట్ కింద కూర్చుని నినాదాలు చేస్తుండగా, గొల్ల బుచ్చమ్మ, సువర్ణలు రాళ్లు విసిరినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో నిరసనకారులు ఆగ్రహావేశానికి లోనయ్యారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. సీఐ గాంధీ నాయక్ జోక్యం చేసుకుని, నిరసన నాయకుల దగ్గర ఉన్న డాక్యుమెంట్‌లను మాజీ సర్పంచ్ సుహాసిని రాంలాల్ తో కలిసి పరిశీలించారు. గ్రామస్థుల అభ్యంతరాలను విన్న అనంతరం, "ఈ స్థలంలో తాత్కాలికంగా ఎలాంటి పనులు జరగకూడదు" అని పోలీసు అధికారి స్పష్టం చేశారు.
సామాజిక కార్యకర్త దిడ్డి కాడి గోపాల్ మాట్లాడుతూ, "నాలా పర్మిషన్ ఎలా ఇచ్చారు? ఇక్కడ ఎవరైనా వరి, జొన్న పంటలు వేసినట్లు ఉంటే చూపించాలి" అన్నారు. తన వంతుగా రాంలాల్ మాట్లాడుతూ "ఈ సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి, రెండు రోజుల్లో మహిళా సమాఖ్యకు స్థలం లభించేలా కృషి చేస్తాం" అని గ్రామస్థులను నమ్మబలికారు. అనంతరం నిరసనకారులు శాంతించారు. కార్యక్రమంలో సామాజిక కార్యకర్తలు గోపాల్, రాజేశ్వర్, రాంలాల్, పంతులు చెన్నయ్య, కొత్త నర్సింలు, పవన్ కుమార్, శాంతి రంగ్యా, తదితరులు పాల్గొన్నారు.






