పెబ్బేర్ లో ఘనంగా మహిళా దినోత్సవం

by Naveena |

మున్సిపా లిటీ సుభాష్ చౌరస్తాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవంను బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు.

పెబ్బేర్ లో ఘనంగా మహిళా దినోత్సవం
X

దిశ,పెబ్బేరు: మున్సిపా లిటీ సుభాష్ చౌరస్తాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవంను బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. మహిళలకు చీరలు పెట్టి శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి పలువురు మాట్లాడుతూ.. మహిళలు లేనిదే మనగడ లేదని, మహిళలే సృష్టికి మూలం అని అన్నారు. మనదేశంలో మహిళలకు ప్రత్యేక స్థానం కల్పించుకున్నామని మాట్లాడారు. ఈ కార్యక్రమం లో మాజీ మున్సిపల్ చైర్మన్ కరుణ శ్రీ, మాజీ మార్కెట్ చైర్మన్, శ్యామల, మున్సిపల్ వైస్ చైర్మన్ కర్రెస్వామి , మాజీ కౌన్సిలర్ పార్వతి, శ్రీరంగాపురం సింగిల్విండో అధ్యక్షులు జగన్నాతం,మాజీ కౌన్సిలర్ ఎల్లారెడ్డి, బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు.

Next Story