- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళలు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు వహించాలి
జడ్చర్లలో ఇందిరా ప్రియ దర్శిని ఉమెన్స్ వెల్పేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 2కే రన్ ని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ప్రారంభించారు.

దిశ, జడ్చర్ల : జడ్చర్లలో ఇందిరా ప్రియ దర్శిని ఉమెన్స్ వెల్పేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 2కే రన్ ని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. పట్టణానికి చెందిన పలువురు మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ మహిళలు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు వహించాలని రాజకీయంలో తాను బిజీగా ఉంటూ ప్రజాసేవలో తన భార్య ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించకపోవడంతో క్యాన్సర్ చివరి దశకు చేరి తాను ఈ లోకానికి దూరమైందని భావోద్వేగానికి గురవుతూ మహిళలకు సూచనలు చేశారు. తన భార్య లాగే మరెవరు ప్రాణాల మీదకు తెచ్చుకోకూడదని క్యాన్సర్ పట్ల ముందు జాగ్రత్తగా పరీక్షలు చేయించుకోవాలని ప్రత్యేకంగా మహిళల కోసం తన భార్య పేరుపై శ్వేతా ఫౌండేషన్ పేరుతో ఫౌండేషన్ నెలకొల్పాలని అనుకుంటున్నానని తెలిపారు.
మహిళలు క్యాన్సర్ వ్యాధిని నిరోధించుకునేందుకు వీలుగా ఉంటుందని ఇటీవల గుజరాత్ లో ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రేమ వివాహాల పట్ల ప్రత్యేకంగా చట్టాన్ని అమలు చేసిందని.. దేశవ్యాప్తంగా కూడా చేసే యోచనలో ఉందని 18 ఏళ్లు మైనారిటీ తీరగానే అమ్మాయిలు ప్రేమ పేరుతో తల్లిదండ్రులకు తెలియకుండా పెళ్లిళ్లు చేసుకొని తర్వాత ఇబ్బందులకు గురవుతున్నారని అది కూడా ఎలాంటి పని పాట లేని పోకిరీలను ప్రేమించి పెళ్లి చేసుకొని తమ విలువైన జీవితాన్ని కోల్పోతున్నారని అలా కాకుండా యువతులకు అబ్బాయిల మాదిరిగానే 21 ఏళ్లు వచ్చిన తర్వాత వివాహం జరిపినట్టుగానే అమ్మాయిలకు కూడా ఇరవై ఒక్క ఏళ్లలో పెళ్లిళ్లు జరపాలని అది కూడా తల్లిదండ్రుల అనుమతి సంతకాలతో పెళ్లిళ్లు జరపాలని అలాంటప్పుడే అమ్మాయిలకు జీవితంపై ఆలోచించే జ్ఞానం వస్తుందని తాను అనుకుంటున్నట్టు ప్రత్యేకంగా సూచనలు చేశారు. ఏది ఏమైనా అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు తన భార్యను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురై అటు మహిళలకు ఇటు యువతులకు తగు సూచనలు చేశారు లక్ష్మారెడ్డి.






