- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేశ పరిపాలనలో మహిళలు భాగస్వామ్యం ఇవ్వాలి : ఎంపీ డీ.కే. అరుణ
భారతదేశ పరిపాలనలో మహిళలు భాగస్వామ్యం కావాలని మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యురాలు డీ.కే. అరుణ ఆకాంక్షించారు.

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : భారతదేశ పరిపాలనలో మహిళలు భాగస్వామ్యం కావాలని మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యురాలు డీ.కే. అరుణ ఆకాంక్షించారు. కేంద్రం ప్రవేశపెట్టిన 'నారీ శక్తి వందన్ అధినియం' బిల్లుకు మద్దతు గా మంగళవారం స్టేడియం గ్రౌండ్ నుంచి తెలంగాణ చౌరస్తా వరకు మహిళలతో పాదయాత్ర ర్యాలీ నిర్వహించి మాట్లాడారు. 2029 పార్లమెంట్, అసెంబ్లీ సారస్వతిక ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ 33 శాతం అమలు చేయాలని చట్టం చేయబోతున్నామని, ఇందుకు ప్రధానమంత్రి కంకణం కట్టుకున్న పనిచేస్తున్నారని ఆమె అన్నారు. మహిళలు వస్తే తమ కుర్చీలు, ప్రాధాన్యత పోతుందని మహిళా బిల్లును అడ్డుకునే ప్రయత్నం చేసి వ్యతిరేకించారని, అట్టివారిని రాబోయే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని ఆమె పిలుపునిచ్చారు. తెలంగాణలో 60 నూతన అసెంబ్లీ స్థానాలు పెరిగితే, మెజారిటీగా మహిళా ఎమ్మెల్యేలు అవుతారని, చట్ట సభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరిగి మహిళల అభివృద్ధి, రక్షణ, సమస్యలపై గొంతు విప్పే అవకాశం ఉందని ఆమె తెలిపారు. మహిళా బిల్లుకు మద్దతు తెలపడానికి 9667173333 నెంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వాలని ఎంపీ అరుణ సూచించారు.






