మహిళలు ఆరోగ్యంగా ఉంటూ ఆనందంగా గడపాలి

by Ratna Kumari |

మహిళలు ఆరోగ్యంగా ఉంటూ ఆనందంగా గడపాలని మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీ.కే. అరుణ ఆకాంక్షించారు.

మహిళలు ఆరోగ్యంగా ఉంటూ ఆనందంగా గడపాలి
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : మహిళలు ఆరోగ్యంగా ఉంటూ ఆనందంగా గడపాలని మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీ.కే. అరుణ ఆకాంక్షించారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కలెక్టర్ ఖుష్బూ గుప్త, మేయర్ జి.మమత, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కెరి అనిత లతో కలిసి నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం, వృత్తి జీవితాన్ని సమతుల్యంగా నిర్వహించగలరని అన్నారు. గర్భాశయ క్యాన్సర్ నుండి రక్షించేందుకు 14 నుండి 15 సంవత్సరాల మధ్య వయస్సు గల బాలబాలికలకు ఉచిత హెచ్.పి.వి టీకాను కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు.అలాగే మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు స్థానికంగా చిన్న వ్యాపారాలు ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి 'ముద్ర' యోజన ద్వారా రుణాలు అందిస్తున్నామని, దేశంలో మూడు కోట్ల మహిళా సంఘాల సభ్యులను కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలని లక్ష్యం తో ముందుకు వెళ్లుతున్నట్లు ఎంపి వివరించారు. జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్త మాట్లాడుతూ, మహిళలు తమ శక్తి సామర్థ్యాలు గుర్తించి తమ తమ రంగాల్లో రాణించాలని సూచిస్తూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహబూబ్ నగర్ మేయర్ మమత మాట్లాడుతూ, మహిళల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ, ప్రభుత్వం అందిస్తున్న ఉచిత హెచ్.పి.వి టీకా ను తీసుకుని గర్భాశయ క్యాన్సర్ ను నివారించుకోవాలని సూచించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్త, ఎంపీ డికె అరుణ లు హెచ్.పి.వి టీకా ను ఆవిష్కరించి, ఇందుకు సంబంధించిన గోడ ప్రతులను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో డిడ్ల్యూఓ జరీనా బేగం,సునీత,డిపిఆర్ఓ శ్రీనివాస్,మంజుల,స్వయం సహాయక సంఘాలు, మహిళలు పాల్గొన్నారు.

Next Story