నీటి కోసం ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన మహిళలు

by Taduka Kalyani |   (  Updated:2025-09-06 09:22:32  IST  )

మంత్రి జూపల్లి కృష్ణారావు ఇలాకాలో ప్రజలు తాగునీటి కోసం గత ఇరవై రోజులుగా మండల కేంద్రం ప్రజలు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకపోయింది

నీటి కోసం ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన మహిళలు
X

దిశ, పెద్ద కొత్త పల్లి: మంత్రి జూపల్లి కృష్ణారావు ఇలాకాలో ప్రజలు తాగునీటి కోసం గత ఇరవై రోజులుగా మండల కేంద్రం ప్రజలు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకపోయింది. సహనం కోల్పోయిన మహిళలు ఏకంగా శనివారం మధ్యాహ్నం పెద్ద కొత్తపల్లి బస్టాండులో జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. దీంతో నాగర్ కర్నూల్_కొల్లాపూర్ మధ్య జాతీయ రహదారి పై ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. మండల కేంద్రంలో జాతీయ రహదారి విస్తరణ పనుల్లో గ్రామపంచాయతీ కామిరెడ్డి బోరు ను తొలగించారు. ఈ బోరుకు ప్రత్యామ్నాయంగా ఆ పక్కనే హైవే రోడ్డు కాంట్రాక్టర్ కొత్త గా బోర్ వేశారు. అలాగే మిషన్ భగీరథ పైప్ లైన్ రోడ్డు విస్తరణలో దెబ్బ తినడం మూలంగా ప్రజలకు తాగు నీటి సరఫరా గత 20 రోజులుగా నిలిచిపోయింది. దీంతో తాగునీటి కోసం ప్రజలు పలు ఇబ్బందులకు గురయ్యారు. సహనం కోల్పోయిన పెద్ద కొత్త పల్లి గ్రామస్థులు ఖాళీ బిందెలతో మహిళలు మండల కేంద్రంలో జాతీయ రహదారి పై గంట పాటు రాస్తారోకో నిర్వహించారు.

ఈ రాస్తా రోకో కు బీ ఆర్ ఎస్, బీ జే పీ పార్టీల నాయకులు సంఘీభావం ప్రకటించి రాస్తా రోకో లో పాల్గొని మంత్రి జూపల్లి కృష్ణారావుని, ప్రభుత్వ అధికారుల వైఫల్యం గూర్చి ఆ పార్టీ నాయకులు ఎండగట్టారు. అనంతరం మహిళలు ఖాళీ బిందెలతో ర్యాలీగా ఎంపీ డీ ఓ కార్యాలయాన్ని ముట్టడించారు. తాగు నీటి సమస్య తీర్చాలని కోరుతూ ఎంపీ డీ ఓ ద్వారా జిల్లా కలెక్టర్ కు వినతి పత్రాన్ని పంపారు. ఈ కార్యక్రమంలో గ్రామ మహిళతో పాటు మాజీ సర్పంచ్ జక్కుల నరసింహ, బీ ఆర్ ఎస్ మండల నాయకులు పి నాగరాజు,రాజశేఖర్ శెట్టి, గడ్డికోపుల బాలస్వామి, విజ్ఞయ్య, పిల్లి పెద్ద రాములు, బీ జే పీ మండల అధ్యక్షుడు దేశ మో నీ పరశురాముడు, మండల ప్రధాన కార్యదర్శి పిల్లి నాగరాజు, మీడియా కన్వీనర్ మేకల శివ, నాయకులు సిద్ధార్థ, పిల్లి వెంకటస్వామి, కాలనీవాసులు గురు బ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు.

Next Story