- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పూజ గదిలో మహిళ కు పాము కాటు..!
దిశ, కొల్లాపూర్ : దీపావళి పండుగ నేపథ్యంలో ఇంట్లో పూజ గదిలోని దేవుళ్ళ పటాలను తీస్తున్న గృహిణి ని నాగు పాము కాటు వేయడం తో దావఖానా కు తరలించిన

దిశ, కొల్లాపూర్ : దీపావళి పండుగ నేపథ్యంలో ఇంట్లో పూజ గదిలోని దేవుళ్ళ పటాలను తీస్తున్న గృహిణి ని నాగు పాము కాటు వేయడం తో దావఖానా కు తరలించిన సంఘటన మంగళవారం నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం ఎన్మన్ బెట్ల గ్రామంలో చోటు చేసుకుంది. సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలోని దళిత కాలనీ నివాసం ఉంటున్న దళిత వెంకటమ్మ దీపావళి పండుగ సందర్బంగా ఇంట్లో పూజ గదిలో దేవుని పటాలను పూజించేందు కోసం శుభ్రం చేసేందుకు పటాలను తీస్తున్న క్రమంలో పటాల వెనుక ఉన్న నాగు పాము ఆమెను కాటు వేసింది. వెంటనే అప్రమత్తం అయినా కుటుంబ సభ్యులు వెంటనే కొల్లాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం ఆరోగ్య పరిస్థితి ఆందోళన కరంగా ఉండడంతో వైద్యులు సూచన ల మేరకు మెరుగైన వైద్యం కోసం నాగర్ కర్నూల్ జిల్లా ఆస్పత్రికి వెంకటమ్మ ను తరలించారు. ప్రస్తుతం జిల్లా దావఖానాలో వెంకటమ్మ చికిత్స పొందుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.






