మహిళ పై గుర్తు తెలియని వ్యక్తుల దాడి

by Nallavelli.Anjaneyulu |

మహిళ పై గుర్తు తెలియని వ్యక్తుల దాడి చేసిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లా తెల్కపల్లి మండలంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది.

మహిళ పై గుర్తు తెలియని వ్యక్తుల దాడి
X

దిశ, నాగర్ కర్నూల్/తెల్కపల్లి : మహిళ పై గుర్తు తెలియని వ్యక్తుల దాడి చేసిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లా తెల్కపల్లి మండలంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. మండలంలోని రాకొండ గ్రామానికి చెందిన ఎరుకలి రాములమ్మపై కులవృత్తిగా ఎరుకలి గద్దె చెప్పుకుంటూ జీవనం సాగిస్తున్నది. తన పని ముగించుకొని ప్రతి రోజు సాయంత్రం రాకొండ గ్రామానికి వెళ్ళేది. లేటు అయినా రోజు తెల్కపల్లి లోని తన ఇంట్లో ఒక్కతే నిద్రించేది. ఇదే క్రమంలో సోమవారం రాత్రి ఇంటికి రాలేదు. గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు తలుపు తట్టి తల, ముఖంపై కర్రలతో దాడి చేశారు. చెవుల కమ్మలు, మెడలో గుండ్లు, చేతుల వెండి కడియాలు అపహరణ చేశారు. ఆమె నుంచి ఒక తులం బంగారం, 20 తులాల వెండి దోపిడి చేశారు. బిడ్డ, అల్లుడు ఫోన్ చేసిన ఎత్తలేదు. వెంటనే తెల్కపల్లి వెళ్లి చూడగా రక్తపు మడుగులో పడి ఉంది. దీంతో నాగర్ కర్నూల్ జిల్లా ఆసుపత్రికి తరలించగా వారు పట్టించుకోలేదు. అక్కడి నుంచి వెల్డండ యేన్నం ప్రైవేట్ ఆసుపత్రికి తరలిచారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు స‌మాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని ద‌ర్యాప్తు చేప‌డుతున్నారు.

Next Story