- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉద్యోగ భద్రత లేక.. పెళ్లి చేసుకోలేక 33 ఏళ్లుగా నిరీక్షణ..!
ప్రభుత్వం తనకు ఉద్యోగ సర్వీస్ క్రమబద్ధీకరించక పోదా..? అప్పుడే పెళ్లి చేసుకుంటానని ఓ చిరు ఉద్యోగి ప్రభుత్వ కరుణ కోసం 33 ఏళ్లుగా నిరీక్షిస్తున్నాడు.

దిశ, కొల్లాపూర్ : ప్రభుత్వం తనకు ఉద్యోగ సర్వీస్ క్రమబద్ధీకరించక పోదా..? అప్పుడే పెళ్లి చేసుకుంటానని ఓ చిరు ఉద్యోగి ప్రభుత్వ కరుణ కోసం 33 ఏళ్లుగా నిరీక్షిస్తున్నాడు. ప్రస్తుతం అతని వయస్సు(53). ప్రభుత్వం మానవతా దృక్పథంతో కరుణించి ప్రజా పాలన ప్రభుత్వం తనకు ఉద్యోగ క్రమబద్దీ కరించకపోదా అని ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు బాధితుడు పోతులపల్లి వెంకట స్వామి. తనకు ప్రభుత్వం న్యాయం చేస్తుంది!అప్పుడే పెండ్లి చేసుకుంటాననీ బాధితుడు చెబుతున్నాడు. గత 33 ఏళ్లుగా పశుసంవర్థక శాఖ వెటర్నరీ సబ్ సెంటర్ లో ఆఫీస్ సబార్డినేటర్ గా విధులు నిర్వహిస్తున్నాడు.
తనకు ఉద్యోగ క్రమబద్దీకరించలేదంటూ కొల్లాపూర్ మండలం ఎన్మన్ బెట్ల గ్రామవాసి బాధితుడు పోతులపల్లి వెంకట స్వామి వాపోయాడు. తన ఆక్రందనను గూర్చి రాత పూర్వకంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, జిల్లాకు చెందిన మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఎంపీ మల్లు రవి, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ లకు వినతి పత్రాలను అందజేసినట్టు పోతుల పల్లి వెంకట స్వామి తెలిపాడు. దాదాపు 1992 నుంచి వెటర్నరీ సబ్ సెంటర్ లో ఆఫీస్ సబార్డినేటర్ గా పని చేస్తున్నా.. తనకు కనీస వేతనం లేకుండా బతుకు బండి లాగుతున్నాడు. ప్రస్తుతం కొల్లాపూర్ మండలం నార్లాపూర్ వెటర్నరీ సబ్ సెంటర్ లో ఆఫీస్ సబార్డినేటర్ గా పని చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజా పాలన ప్రభుత్వం.. కరుణించి ఉద్యోగ క్రమబద్దీకరిస్తుందా! లేక పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగా పోతులపల్లి వెంకట స్వామి ఉండిపోతారా..? వేచి చూద్దాం.






