- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > మహబూబ్ నగర్ > బీసీల ప్రజాదరణతో కాంగ్రెస్ గెలుపు ఖాయం : గద్వాల కాంగ్రెస్ అభ్యర్థి సరిత
బీసీల ప్రజాదరణతో కాంగ్రెస్ గెలుపు ఖాయం : గద్వాల కాంగ్రెస్ అభ్యర్థి సరిత
by Batti.Sumithra |
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని బీసీల ప్రజాదరణతో కాంగ్రెస్ గెలుపు ఖాయమని సరిత ధీమా వ్యక్తం చేశారు.

X
దిశ, గద్వాల టౌన్ : జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని బీసీల ప్రజాదరణతో కాంగ్రెస్ గెలుపు ఖాయమని సరిత ధీమా వ్యక్తం చేశారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో అసెంబ్లీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ గద్వాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి అనుకూల వాతావరణం ఏర్పడిందని ఇది కాంగ్రెస్ గెలుపునకు సంకేతమని సరిత అన్నారు. తనకు ప్రజలు చూపిస్తున్న ఆదరణకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఆమె వెంట న్యాయవాది షఫీ ఉల్లా, కాంగ్రెస్ పార్టీ నాయకులు బండ్ల లక్ష్మీదేవి, చంద్రశేఖర్ రెడ్డి, మధుసూదన్ బాబు, ఆనంద్ గౌడ్ పాల్గొన్నారు.
Next Story






