కేసీఆర్ చేప‌ట్టిన అభివృద్ధి ప‌నులతోనే బీఆర్ఎస్ గూటికి

by Nallavelli.Anjaneyulu |

కేసీఆర్ చేప‌ట్టిన అభివృద్ధి ప‌నుల‌తోనే ప‌లువురు బీజేపీ నాయ‌కులు బీఆర్ఎస్ పార్టీలో చేరాన‌ని మాజీ ఎమ్మెల్యే బీరం హ‌ర్ష వ‌ర్ధ‌న్ రెడ్డి తెలిపారు.

కేసీఆర్ చేప‌ట్టిన అభివృద్ధి ప‌నులతోనే బీఆర్ఎస్ గూటికి
X

దిశ‌, కొల్లాపూర్ : తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు చేప‌ట్టిన ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు ఆక‌ర్షితులై ప‌లువురు బీఆర్ఎస్ లో చేరుతున్నారని మాజీ ఎమ్మెల్యే బీరం హ‌ర్ష వ‌ర్ద‌న్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం కొల్లాపూర్ నియోజ‌క‌వ‌ర్గం చిన్నంబావి మండ‌లం కొప్పునూరు, వెల్టూరు గ్రామాల‌కు చెందిన ప‌లువురు బీజేపీ శ్రేణులు మాజీ ఎమ్మెల్యే బీరం హ‌ర్షం వ‌ర్ద‌న్ రెడ్డి, బీఆర్ఎస్ నేత రంగినేని అభిలాష‌రావు స‌మక్షంలో గులాబీ పార్టీలో చేరారు. ఈ సంద‌ర్భంగా మాజీ ఎమ్మెల్యే వారికి గులాబీ కండువాలు క‌ప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు. ఈ కార్య‌క్ర‌మంలో చిన్నంబావి మండ‌ల నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.

Next Story