- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తహశీల్దార్ కార్యాలయంలో ఆపరేటర్ల ఇష్టారాజ్యం
దిశ, కేటిదొడ్డి : కుల, ఆదాయ ధ్రువ పత్రాల నుంచి మొదలై భూమి రిజిస్ట్రేషన్ వరకు డిమాండ్ ను బట్టి కేటిదొడ్డి తహసీల్దార్ కార్యాలయంలో పైసలు వసూలు చేస్తున్నారు.

దిశ, కేటిదొడ్డి : కుల, ఆదాయ ధ్రువ పత్రాల నుంచి మొదలై భూమి రిజిస్ట్రేషన్ వరకు డిమాండ్ ను బట్టి కేటిదొడ్డి తహసీల్దార్ కార్యాలయంలో పైసలు వసూలు చేస్తున్నారు. ముడుపులు ఇస్తేనే పనులు సాధ్యం అనే తరహాలో ఇక్కడ సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రైవేట్ వ్యక్తులను పెట్టుకుని మరీ దందాలు నడిపిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. ఆదాయ, కులం తో పాటు ఇతర దృవ పత్రాలు జారీని ప్రభుత్వం సులభతరం చేసి.. క్షణాలలో మీసేవా కేంద్రాలలో పొందేలా ప్రభుత్వం పలు రకాల సంస్కరణలు తీసుకొచ్చిన క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. క్షేత్ర స్థాయిలో కార్యాలయంలో కొందరు ప్రతీ పనికి ఒక రేటు ఫిక్స్ చేసి పేద ప్రజల నుంచి ముక్కు పిండి వసూళ్లకు పాల్పడుతున్నారు. ఫైల్స్ ముందుకు కదలాలంటే పైసలు ఇవ్వాల్సిందేనంటూ బరి తెగిస్తున్నారని పలువురు బాధితులు బహిరంగంగా విమర్శిస్తున్నారు. అత్యవసర సమయంలో కుల, ఆదాయ ధృవ పత్రాల కోసం దరఖాస్తు చేస్తే నిర్దేశిత గడువు లోపు అధికారులు వాటిని జారీ చేయాల్సి ఉండగా నిబంధనలకు విరుద్దంగా కార్యాలయ సిబ్బంది వ్యవహరిస్తున్నారు.






