- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తుది శ్వాస వరకు బీజేపీలోనే ఉంటా : బాల త్రిపుర సుందరి
పార్టీ మారే ప్రసక్తే లేదని.. తన తుది శ్వాస విడిచేంత వరకు బీజేపీలోనే ఉంటానని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బాల త్రిపుర సుందరి స్పష్టం చేశారు.

దిశ, జడ్చర్ల : పాలమూరు జిల్లా బీజేపీ అంతర్గత వ్యవహారాల్లో కొందరి తీరు నచ్చక పోవడం, వారి ఒంటెద్దు పోకడల మూలంగా పార్టీ పదవికి రాజీనామా చేసేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగిందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బాల త్రిపుర సుందరి తెలిపారు. రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు నా రాజీనామాను తిరస్కరించారని.. ఇదే అదునుగా తీసుకుని కొందరు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారని బాలా త్రిపుర సుందరి పేర్కొన్నారు. నా రాజకీయ జీవితం మొత్తం బీజేపీ తోనే ఉంటుంది. జడ్చర్ల నియోజకవర్గ కార్యకర్త లు, నాయకులకు ఎల్లకాలం అందుబాటులో ఉంటూ బీజేపీ పటిష్టంగా ఉండేందుకు పాటు పడుతాను. సముచిత స్థానం కల్పిస్తామని రామచంద్రరావు హామి .. నా పదవికి రాజీనామా చేస్తున్న విషయం తెలుసుకున్న రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు నాతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలో నా అణచివేత కు జరుగుతున్న పరిణామాలు రామచంద్రరావు కి వివరించినట్టు తెలిపారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ మొదటి సారి పాల్గొన్న పాలమూరు బహిరంగ సభలో తనను వేదిక మీదకు రానివ్వకుండా..అడ్డుకున్న తీరు వివరించగా.. రామచంద్రరావు విస్మయం వ్యక్తం చేశారు. పాస్ ఉన్నప్పటికీ ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. ఇక మీదట పార్టీలో సముచిత స్థానం ఉంటుందని భరోసా ఇచ్చారు. జిల్లా ముఖ్య నేతల తో చర్చించి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. పార్టీ కి మీ లాంటి విజ్ఞానవంతులైన, యువ మహిళ నాయకుల అవసరం ఉందన్నారు. రాజీనామా చేసినా తిరస్కరించడం జరుగుతోందని ఆయన స్పష్టంచేశారు.






