భార్య వివాహేత‌ర సంబంధం.. భ‌ర్త ఆత్మ‌హ‌త్య

by Ratna Kumari |

భార్య వివాహేత‌ర సంబంధం కార‌ణంగా భ‌ర్త సూసైడ్ చేసుకున్న ఘ‌ట‌న నారాయ‌ణ‌పేట జిల్లా కృష్ణా మండ‌లం ముడుమాల గ్రామంలో చోటు చేసుకుంది.

భార్య వివాహేత‌ర సంబంధం.. భ‌ర్త ఆత్మ‌హ‌త్య
X

దిశ‌, కృష్ణా, మ‌క్త‌ల్ : వారిద్ద‌రూ ప్రేమించుకున్నారు. పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. కానీ పెళ్లి జ‌రిగిన త‌రువాత వారి జీవితంలోకి మ‌రోవ్య‌క్తి రావ‌డంతో వారి కాపురం ఎక్కువ రోజులు నిల‌వ‌లేక‌పోయింది. ఈ ఘ‌ట‌న నారాయ‌ణ‌పేట జిల్లా కృష్ణా మండ‌లం ముడుమాల గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన ప్ర‌కారం.. గ్రామానికి చెందిన హ‌న్మేష్, తాయ‌మ్మ‌లు ప్రేమించుకున్నారు. వీరిద్ద‌రికీ ఒకే కులం కావ‌డంతో వీరి ప్రేమ‌ను పెద్ద‌లు అంగీక‌రించ‌డంతో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్ద‌రు సంతానం కూడా. అయితే ఇదే క్ర‌మంలో భార్య ఓ వ్య‌క్తితో వివాహేత‌ర సంబంధం కొన‌సాగించింది. ఈ విష‌యం తెలిసిన భ‌ర్త‌.. బంధువులు వీరిద్ద‌రినీ మంద‌లించారు. అయినా భార్య తీరు మార‌క‌పోవ‌డంతో భ‌ర్త పొలంలో చెట్టుకు ఉరేసుకొని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఈ విష‌యం పై హ‌న్మేష్ త‌ల్లి పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. తాయ‌మ్మ ఓ డ్రైవ‌ర్ తో వివాహేత‌ర సంబంధం కార‌ణంగానే త‌న కుమారుడు ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన‌ట్టు ఫిర్యాదు చేసింది. ఎస్సై న‌వీద్ కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేప‌డుతున్న‌ట్టు తెలిపారు. హైద‌రాబాద్ లో డ్రైవ‌ర్ నాగ‌న్న‌ను అరెస్ట్ చేసిన‌ట్టు స‌మాచారం. గ్రామంలో ఈ ఘ‌ట‌న గురించే అంద‌రూ చ‌ర్చించుకోవ‌డం గ‌మ‌నార్హం.

Next Story