పక్క పక్కనే రెండు స‌మాచారం హ‌క్కు చ‌ట్టం బోర్డులు ఎందుకు..?

by Nallavelli.Anjaneyulu |

దిశ, కొల్లాపూర్ : పట్టణంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం భవనం బయట గోడ పై అధికారులు సమాచార హక్కు చట్టం- 2005 రెండు

పక్క పక్కనే రెండు స‌మాచారం హ‌క్కు చ‌ట్టం బోర్డులు ఎందుకు..?
X

దిశ, కొల్లాపూర్ : పట్టణంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం భవనం బయట గోడ పై అధికారులు సమాచార హక్కు చట్టం- 2005 రెండు బోర్డులు రాసి పెట్టారు. ఈ రెండు సమాచార హక్కు చట్టం బోర్డులు గోడ పై పక్క పక్కనే ఉండడం తో వివిధ పనుల మీద చుట్టూ పక్కల గ్రామాల నుంచి వచ్చేస్తున్న సందర్శకులు ఈ బోర్థులను చూసి తిక మక్కా పడుతున్నారు. ఈ రెండు స. హ. చట్టం బోర్డులు ఉండడం, ఆ బోర్డుల పై పేర్లు ఉన్న అధికారులు విధుల్లో ఉండరా!లేక బదిలీ పై ఇతర చోటికి వెళ్లారా..? సందర్శకులకు అంతుచిక్కడం లేదు. పైన బోర్డులో ఉన్న అధికారులందరూ ఏడాది క్రితమే బదిలీ పై వెళ్ళారు. కానీ సదరు అధికారుల పేర్లున్న బోర్డును తుడిచి వేయలేదు. అంతే కాదు.. అప్పిలేట్ అధికారి, ఎంపీడీఓ శేషగిరి శర్మ రిటైర్డు అయ్యారు. పైన ఉన్న స. హ. చట్టం ఆ పాత బోర్డును తూడ్చి వేయక పోవడం అధికారుల నిర్లక్ష్యానికి పరకాష్ట అని చెప్పాలి.

Next Story