విద్యార్థులు అంటే ఎందుకు అంత చిన్న చూపు : మాజీ ఎమ్మెల్యే హ‌ర్షవర్ధన్ రెడ్డి

by Nallavelli.Anjaneyulu |

దిశ, నాగర్ కర్నూల్ : విద్యార్థులు అంటే ఎందుకు అంత చిన్న చూపు అని కొల్లపూర్ మాజీ ఎమ్మెల్యే బీర ర్షవర్ధన్ రెడ్డి అన్నారు. గత కొన్ని రోజుల క్రితం విద్యార్థులు ఆటోలో పెద్దకొత్తపల్లి

విద్యార్థులు అంటే ఎందుకు అంత చిన్న చూపు : మాజీ ఎమ్మెల్యే  హ‌ర్షవర్ధన్ రెడ్డి
X

దిశ, నాగర్ కర్నూల్ : విద్యార్థులు అంటే ఎందుకు అంత చిన్న చూపు అని కొల్లపూర్ మాజీ ఎమ్మెల్యే బీర హ‌ర్షవర్ధన్ రెడ్డి అన్నారు. గత కొన్ని రోజుల క్రితం విద్యార్థులు ఆటోలో పెద్దకొత్తపల్లి మండలం నుంచి సాతాపూర్ పాఠశాలకు పుస్తకాలు తీసుకువెళ్తుండగా ఆటో ఆటో టైర్ పేలి నలుగురు విద్యార్థులు గాయపడిన సంఘటన విధిత‌మే. ఈ నేపథ్యంలో గురువారం కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బిరం హర్షవర్ధన్ రెడ్డి విద్యార్థులను నాగర్ క‌ర్నూల్ జిల్లా ఆసుపత్రిలో పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఘటన కు సంబంధించి పూర్తి బాధ్యత వహించాల్సిన డీఈఓ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. తీవ్రంగా గాయపడి హైదరాబాద్ లో చికిత్స పొందుతున్న అబ్బాయిని పరామర్శిస్తామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పాఠశాలల పరిస్థితి దారుణంగా తయారైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ జిల్లా సీఎం రేవంత్ రెడ్డి ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు అంటే మీకు ఎందుకు అంత చిన్న చూపు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గాయపడిన ప్రతి విద్యార్థికి ఐదు లక్షల రూపాయలు నష్టపరిహారం అందజేయాలని కోరారు.

Next Story