కేసీఆర్ కు ఏం జ‌రిగినా రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుంది

by Nallavelli.Anjaneyulu |

తెలంగాణ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు ఏం జ‌రిగినా రాష్ట్రం అగ్ని గుండంగా మారుతుంద‌ని బీఆర్ఎస్ జిల్లా అధ్య‌క్షుడు, మాజీ మంత్రి ల‌క్ష్మారెడ్డి సంచ‌ల‌న కామెంట్స్ చేశారు.

కేసీఆర్ కు ఏం జ‌రిగినా రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుంది
X

దిశ, జడ్చర్ల : తెలంగాణ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు ఏం జ‌రిగినా రాష్ట్రం అగ్ని గుండంగా మారుతుంద‌ని బీఆర్ఎస్ జిల్లా అధ్య‌క్షుడు, మాజీ మంత్రి ల‌క్ష్మారెడ్డి సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. జ‌డ్చ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గంలో బీఆర్ఎస్ జిల్లా అధ్య‌క్షుడు ల‌క్ష్మారెడ్డి ఆధ్వ‌ర్యంలో బైకు ర్యాలీ నిర్వ‌హించి.. జ‌డ్చ‌ర్ల త‌హ‌శీల్దార్ కార్యాల‌యం ముందు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ‌ను ద‌గ్దం చేశారు. ఈ సంద‌ర్భంగా మాజీ మంత్రి ల‌క్ష్మారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ చేత‌గానిత‌నం వ‌ల్ల‌నే రాష్ట్రం రెండేళ్లుగా అభివృద్ధి చెంద‌లేద‌ని డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్ తో డ్రామాలు ఆడుతూ ప్ర‌భుత్వం కాల‌యాప‌న చేస్తోంద‌న్నారు. సిట్ నోటీసుల పేరుతో బీఆర్ఎస్ నాయ‌కుల‌ను ఇబ్బందుల‌కు గురి చేస్తోంద‌ని.. కేసీఆర్ కు ఏం జ‌రిగినా మ‌రో ఉద్య‌మం చేప‌డుతామ‌ని, రాష్ట్రం అగ్నిగుండంగా మారుతోంద‌ని హెచ్చ‌రించారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి సీఎం రేవంత్ రెడ్డికి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయమని అవకాశమిచ్చారని ఇప్పటికే రెండు సంవత్సరాలు వృధా చేశారని మిగిలిన మూడు సంవత్సరాల్లో అయినా రాష్ట్ర అభివృద్ధిపై ఇచ్చిన హామీల అమలుపై దృష్టి సారించాలని సూచించారు. బీఆర్ఎస్ పై పార్టీ అగ్ర నేతలపై అసత్య ఆరోపణలు నిరాహార కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తామంటే చూస్తూ కోరుకునేది లేదని కాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కొడుగల్ యాదయ్య, మండల పార్టీ అధ్యక్షుడు రఘుపతి రెడ్డి, పిట్టల మురళి, ఇంతియాజ్ ఖాన్, కొండల్, కౌన్సిలర్లు కోట్ల ప్రశాంత్ రెడ్డి బుక్కా మహేష్, ఆలూరి శేష కిరణ్, నందకిషోర్ గౌడ్, చైతన్య లతా, సిరాజ్, దాణేష్, శ్రీకాంత్, అంజిబాబు కరాటే శ్రీను, టైగర్ నరసింహ, మతిన్,విజయ్ రెడ్డి, బాలు, సాయి శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.

Next Story