సబ్ రిజిస్ట్రార్ కార్యాల‌యంలో స‌మ‌య పాల‌న ఏది..?

by Ratna Kumari |

దిశ, అలంపూర్ టౌన్ : సాధార‌ణంగా సినిమాలో చెప్పినట్టు రావడం లేటుగా రండి పోవడం మాత్రం తొందరగా వెళ్లిపోండి అన్నా చందంగా తయారైంది అలంపూర్ సబ్ రిజిస్టార్ కార్యాలయం.

సబ్ రిజిస్ట్రార్ కార్యాల‌యంలో స‌మ‌య పాల‌న ఏది..?
X

దిశ, అలంపూర్ టౌన్ : సాధార‌ణంగా సినిమాలో చెప్పినట్టు రావడం లేటుగా రండి పోవడం మాత్రం తొందరగా వెళ్లిపోండి అన్నా చందంగా తయారైంది అలంపూర్ సబ్ రిజిస్టార్ కార్యాలయం. ఇవాళ ఉద‌యం 11:30అయినా రిజిస్ట్రార్‌ రాకపోవడంతో కార్యాలయానికి వచ్చిన జనం ఇబ్బంది పడుతున్నారు. ఈసీ లు డాకుమెంట్స్ అత్యవసరమై ఉదయాన్నే వచ్చిన వారికీ ఖాళీ కుర్చీ దర్శనంతో నిరాశయే ఎదురౌతుంది. అధికారి వచ్చే వరకు ఎదురు చూడాల్సి వస్తోంది. ప్రతి రోజు ఇలానే జరుగుతుండటంతో ప్ర‌జ‌లంద‌రూ మధ్యాహ్నం తరువాతే రిజిస్ట్రేషన్ లు పెట్టుకుంటున్నారు. ఇప్పటికైనా పై అధికారులు పర్యవేక్షణ చేస్తే బాగుంటుందని ప్రజలు కోరుతున్నారు.

Next Story