Gadwala MLA : గద్వాల ఎమ్మెల్యే మౌనం వెనుక రహస్యమేంటో..

by Batti.Sumithra |

అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఇటీవల గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కేటీఆర్ ను కలవగా బీఆర్ఎస్ లో చేరారని అందరూ చర్చించుకున్నారు.

Gadwala MLA : గద్వాల ఎమ్మెల్యే మౌనం వెనుక రహస్యమేంటో..
X

దిశ, గద్వాల టౌన్ : అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఇటీవల గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కేటీఆర్ ను కలవగా బీఆర్ఎస్ లో చేరారని అందరూ చర్చించుకున్నారు. గద్వాల నియోజకవర్గంలో ఒకే కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు ఉండడంతో పార్టీలో ఇమడలేక పోయారనే వాదనలు గట్టిగా వినిపిస్తున్నాయి. రెండు రోజుల పాటు ఎమ్మెల్యే అజ్ఞాతంలో ఉండడంతో, బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లినట్లు అందరూ ఖరారయ్యారు. అదేవిధంగా ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీలో తగిన ప్రాధాన్యత, సముచిత స్థానం ఉండడంతో పాటు, మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులతో పరిచయం ఉండడంతో తిరిగి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లారని అందరూ అనుకుంటున్నారు.

కాగా గురువారం ఉదయం రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు, దేవరకద్ర ఎమ్మెల్యే గవినోళ్ళ మధుసూదన్ రెడ్డి ఎమ్మెల్యే ఇంటికి వచ్చారు. అల్పాహారం, తేనేటి విందు చేశారు. అనంతరం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి, పాత పరిచయాలు ఉండడం వల్లే ఎమ్మెల్యే వారితో సన్నిహితంగా మెలిగి మాట్లాడారని తెలిపారు. ఈ సందర్భంగా వారి వెంట ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని తీసుకొని హైదరాబాద్ లోని అసెంబ్లీకి బయలుదేరారు. కానీ విలేకరుల సమావేశంలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఏమాత్రం మాట్లాడకపోవడంతో, మౌనం పాటించడం వెనుక రహస్యమేంటో అని అర్థం కాని అయోమయ పరిస్థితిలో గద్వాల ప్రజలు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఉన్నారు.

Next Story