కూతుర్ని హతమార్చిన తల్లి.. చివరికి ఏం చేసిందంటే?

by Jakkula.Mamatha |   (  Updated:2025-08-25 13:46:54  IST  )

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది.

కూతుర్ని హతమార్చిన తల్లి.. చివరికి ఏం చేసిందంటే?
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి: మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. పట్టణంలోని జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం సమీపంలో నివాసం ఉంటున్న గృహిణి యశోద (36) ఈరోజు(సోమవారం) ఉదయం తన కూతురు(3)ను ఊపిరి ఆడకుండా చేసి హతమార్చింది. అనంతరం ఆమె ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నది.

రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్ఐ విజయ్ భాస్కర్ కథనం ప్రకారం.. గత నెల రోజుల క్రితం తన ఇంటి ముందు ఆరబోసిన పల్లీలను ఒక్క వీధి కుక్క తింటుండగా చూసిన యశోద, ఆ కుక్కను అదిలించి, వాటిని కడిగి తిన్నదని, వాటి వలన రేబిస్ వ్యాధి సోకి మతిస్థిమితం కోల్పోయి సోమవారం ఉదయం ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ఆయన తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ విజయ్ భాస్కర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Also Read.

వివాహిత అనుమానస్పద మృతి.. పోలీస్ వాహనం నడిపిన నిందితుడు

Next Story