- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉన్నత చదువులకని వెళ్లి అనంతలోకాలకు.. అమెరికాలో తెలంగాణ యువకుడి మృతి
అమెరికాలో మరో తెలంగాణ విద్యార్థి ఆకస్మికరంగా ప్రాణాలు కోల్పోయాడు.

దిశ, వెబ్‌డెస్క్: ఉన్నత చదువులు చదవాలని అమెరికా వెళ్లిన తెలంగాణకు చెందిన మరో విద్యార్థి అక్కడ ప్రాణాలు కోల్పోయాడు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన అరుణ్ సాయిరెడ్డి బొల్లెందుల (26) అమెరికాలో ఆకస్మిక అనారోగ్యంతో కన్నుమూశాడు. మహబూబ్‌నగర్‌కు చెందిన అరుణ్ సాయిరెడ్డి బొల్లెందుల ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లాడు. చదువు పూర్తి చేసుకున్న తర్వాత ప్రస్తుతం ఆయన ఫ్లోరిడాలోని టెంపా నగరంలో నివసిస్తున్నాడు. అక్కడ స్టెమ్ ఓపీటీ (STEM OPT - Optional Practical Training)లో భాగంగా ప్రాక్టికల్ ట్రైనింగ్ పొందుతున్నాడు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ..
అయితే, జూన్ 19న బాగానే ఉన్న అరుణ్ సాయిరెడ్డి ఉన్నట్లుండి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో తోటి స్నేహితులు తక్షణమే అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ అత్యవసర విభాగంలో చేర్పించి వైద్యులు చికిత్స అందించినప్పటికీ, పరిస్థితి విషమించడంతో అరుణ్ సాయిరెడ్డి ఆసుపత్రిలోనే కన్నుమూశాడు. 26 ఏళ్ల చిన్న వయసులోనే కొడుకు దూరమయ్యాడనే వార్త తెలియడంతో మహబూబ్‌నగర్‌లోని ఆయన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. అరుణ్ సాయిరెడ్డి పార్థివ దేహాన్ని తిరిగి స్వదేశానికి తీసుకురావడానికి స్నేహితులు, ప్రవాస తెలుగు సంఘాలు ప్రయత్నాలు చేస్తున్నాయి.






