- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రైతుల సంక్షేమమే లక్ష్యం : పీఏసీఎస్ చైర్మన్
దిశ, మహమ్మదాబాద్/గండీడ్ : రైతుల సంక్షేమమే తమ లక్ష్యం అని ఉమ్మడి గండీడ్ పీఏసీఎస్ చైర్మన్ గిరమోని లక్ష్మీనారాయణ తెలిపారు. శుక్రవారం ఉమ్మడి గండీడ్ మండల

దిశ, మహమ్మదాబాద్/గండీడ్ : రైతుల సంక్షేమమే తమ లక్ష్యం అని ఉమ్మడి గండీడ్ పీఏసీఎస్ చైర్మన్ గిరమోని లక్ష్మీనారాయణ తెలిపారు. శుక్రవారం ఉమ్మడి గండీడ్ మండల పీఏసీఎస్ తరఫున ఎల్.టీ. లోన్ల మంజూరు కోసం జిల్లా డీసీసీబీ అధికారులను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్ కొత్త కుర్మా సత్తయ్య, సీఈవో భాస్కర్ సుబ్రహ్మణ్యం, జీఎం పి. ప్రభాకర్ రెడ్డి, డీజీఎం సతీష్ రెడ్డిలను కలిసి రైతుల అవసరాల దృష్ట్యా మండలానికి తక్షణమే ఎల్.టి. రుణాలు మంజూరు చేయాలని కోరారు. వ్యవసాయ పనులు సాగించేందుకు, రాబోయే సీజన్‌కు అవసరమైన పెట్టుబడి లభించేందుకు ఈ రుణాలు అత్యవసరమని చైర్మన్ తెలిపారు. అధికారులు సానుకూలంగా స్వీకరించినట్లు పీఏసీఎస్ చైర్మన్ తెలిపారు. రైతుల సంక్షేమం కోసం అవసరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పీఏసీఎస్ తరఫున వారికి ఉమ్మడి గండీడ్ మండల చైర్మన్ లక్ష్మీనారాయణ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.






