- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జిల్లా సాయుధ దళ కార్యాలయంలో ఆయుధ పూజ
దిశ, గద్వాల క్రైమ్ : విజయదశమిని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని సాయుధ దళ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పూజ లో ఎస్పీ శ్రీనివాసరావు పాల్గొని ఆయుధాలు, వాహనాలకు

X
దిశ, గద్వాల క్రైమ్ : విజయదశమిని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని సాయుధ దళ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పూజ లో ఎస్పీ శ్రీనివాసరావు పాల్గొని ఆయుధాలు, వాహనాలకు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ శాఖలో ప్రతి సంవత్సరం దసరా పండగ ముందు ఆయుధ పూజ నిర్వహించడం సంప్రదాయంగా వస్తుందన్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా విజయదశమి పండుగ జరుపుకుంటున్నట్టు తెలిపారు. సమాజంలో చెడును పార ద్రోలడానికి పోలీసు విభాగం నిరంతర కృషి చేస్తుందన్నారు. పోలీస్ సిబ్బందికి, ప్రజలకు ముందస్తుగా దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ కె.శంకర్, డి.ఎస్పీ మొగిలయ్య, సాయుధ దళ డి.ఎస్పీ నరేందర్ రావు, ఆర్.ఐలు వెంకటేష్, హారిఫ్, గద్వాల సిఐ శ్రీను, సి.సి.ఎస్ సి.ఐ. నాగేశ్వర్ రెడ్డి, ఆర్.ఎస్‌లు ,సాయుధ దళ సిబ్బంది పాల్గొన్నారు.
Next Story






