నూతన కార్యవర్గంతో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తాం : డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్

by Ratna Kumari |

జిల్లా కాంగ్రెస్ కమిటీ నూతన కార్యవర్గంతో జిల్లాలోని ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు, అన్ని అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తల సహకారంతో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తామని డిసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ ఒక ప్రకటనలో తెలిపారు.

నూతన కార్యవర్గంతో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తాం : డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : జిల్లా కాంగ్రెస్ కమిటీ నూతన కార్యవర్గంతో జిల్లాలోని ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు, అన్ని అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తల సహకారంతో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తామని డిసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ ఒక ప్రకటనలో తెలిపారు. నూతన కార్యవర్గంలో అన్ని వర్గాల వారికి తగిన ప్రాధాన్యత ఇచ్చామని ఆయన తెలిపారు. నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి టిపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్యఅతిథిగా పాల్గొని కమిటీ సభ్యులకు నియామక పత్రాలు అందజేయడంతో కార్యవర్గ సభ్యులు, కార్యకర్తలలో మరింత బలం, ఉత్సాహం కలిగిందని ఆయన తెలిపారు. 2029 ఎన్నికల్లో కేంద్రం,రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి కార్యకర్త పట్టదలతో కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. టిపీసీసీ అధ్యక్షుడుగా మహేష్ కుమార్ గౌడ్ మొదటి సారి జిల్లాకు రావడం, ఆయనకు ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికినందుకు ఆయన ఆనందం వ్యక్తం చేస్తూ వారికి కృతజ్ఞతలు తెలిపారు.

Next Story