మా హయాంలో అక్రమ మట్టి తవ్వకాలు అరికడతాం

by Nallavelli.Anjaneyulu |

సిరుసనగండ్ల గ్రామ శివారులో ఉన్న మేడి కుంటపై, సిరుసనగండ్ల నుంచి రామచంద్రపురం రహదారి పనులపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని సిరుసనగండ్ల, రామచంద్రాపురం గ్రామ సర్పంచులు కామెళ్ళ రామస్వామి, జ్యోతిమాధవరెడ్డి, ఉప సర్పంచి కళ్లు సురేందర్ అన్నారు.

మా హయాంలో అక్రమ మట్టి తవ్వకాలు అరికడతాం
X

దిశ, చారకొండ : సిరుసనగండ్ల గ్రామ శివారులో ఉన్న మేడి కుంటపై, సిరుసనగండ్ల నుంచి రామచంద్రపురం రహదారి పనులపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని సిరుసనగండ్ల, రామచంద్రాపురం గ్రామ సర్పంచులు కామెళ్ళ రామస్వామి, జ్యోతిమాధవరెడ్డి, ఉప సర్పంచి కళ్లు సురేందర్ అన్నారు. శుక్రవారం మేడికుంటను, రామచంద్రాపురం రహదారి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిరుసనగండ్ల నుంచి రామచంద్రాపురం వరకు రెండు కిలోమీటర్ల బీటీ రోడ్డు స్థానిక ఎన్నికలకు ముందు మంజూరు కావడం జరిగిందన్నారు. ఎన్నికలకు ముందే బీటి రోడ్డు వేయడానికి మేడికుంటలో మట్టి తీసి రామచంద్రపురం - సిరుసనగండ్ల రోడ్డుకు రెండు టిప్పర్లతో అవసరమైన మేరకు మట్టి పోయడం జరిగింది, కానీ వాస్తవాలకు విరుద్ధంగా 300 టిప్పర్ల మట్టి అమ్ముకుంటున్నార అని ప్రచారం చేయడం, ఇలా ప్రచారం చేస్తున్న వ్యక్తులు నిరూపించాలి లేకపోతే క్షమాపణ చేయాలని డిమాండ్ చేశారు. మేడి కుంటలో ఎన్నో ఏడ్లుగా స్థానిక అవసరాలకు మట్టి తరలించడం జరిగింది. కానీ కుంటలో మట్టి అంతా ఇప్పుడే తరలించినట్లు ఎలా ప్రచారం చేస్తారని వారు ప్రశ్నించారు. పైగా కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు అని ప్రచారం చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. ఎన్నికల కన్నా ముందు రోడ్డు మీద పోసిన మట్టి చదును చేయకుండానే 300 టిప్పర్ల మట్టి ఎక్కడ ఉందో నిరూపించాలని డిమాండ్ చేశారు. రూ.600 నుంచి రూ. 1000 వరకు అమ్ముకుంటున్నారనేది పచ్చి అబద్ధమని, నిజాలు తెలుసుకోవాలని కోరారు. అనవసరమైన ప్రచారం ప్రజలను గందరగోళం చేయవద్దన్నారు. కుంటలో ఎన్నో ఏళ్ల నుంచి తరలించిన మట్టిని ఇప్పుడే తరలించినట్లనేది ఏ ప్రయోజనాలు ఆశించి రాశారో, ఎవరికి లాభం చేకూర్చడానికో స్థానిక ప్రజలకు అర్థం అయ్యిందని, ఇలాంటి స్వప్రయోజనాల కోసం ప్రజా అభివృద్ధికి నష్టం కలిగించే ప్రయత్నం చేస్తే సహించేది లేదని వారు తెలిపారు. కార్యక్రమంలో సిరుసనగండ్ల, రామచంద్రపురం గ్రామానికి చెందిన వార్డ్ మెంబర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Next Story