పాకిస్తాన్ నుంచి డబ్బులు వస్తాయట‌... నాగురావ్ నామాజీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

by Nallavelli.Anjaneyulu |   (  Updated:2025-09-30 13:45:44  IST  )

పాకిస్తాన్ నుంచి డబ్బులు వస్తాయట‌... నాగురావ్ నామాజీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
X

దిశ, నారాయణపేట క్రైమ్ : పాకిస్తాన్ నుంచి వాళ్ల‌కు డ‌బ్బులు అని బీజేపీ సీనియ‌ర్ నేత నాగురావ్ నామాజీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా బీజేపీ జిల్లా అధ్యక్షులు సత్య యాదవ్ తో కలిసి నామాజీ మీడియాతో మాట్లాడారు. ఇవ్వ‌ని డ‌బ్బుల‌కు ప్రామిస‌రీ నోట్లు రాయించుకొని సూసైడ్ చేసుకొని చ‌నిపోవ‌డానికి కార‌కుడు అవ్వ‌డంతో పాటు పాకిస్తాన్ నుంచి మాకు డ‌బ్బులు వ‌స్తాయ‌ని.. నువ్వు మ‌తం మారుతావా..? లేదా అంటూ డ‌బ్బులు ఇస్తావా లేదా అని ఓ వ్య‌క్తి భ‌య‌బ్రాంతుల‌కు గురి చేసిన‌ట్టు తెలిపారు. మా దగ్గర 10 కేజీల బంగారు నాణేలు ఉన్నాయి? నెలనెల పాకిస్తాన్ నుంచి డబ్బులు వస్తాయి ఆ డబ్బుతోనే ఫామ్ హౌస్ ..కార్లు... బంగ్లాలు కట్టుకున్నామని ఓ వ్యక్తి మరో వర్గానికి చెందిన వ్యక్తులను ఉసిగొల్పి బలవంతపు మతమార్పిడులకు పాల్పడుతున్నాడని నామాజీ ఆరోపించారు. ఇంత పెద్ద భారీ కుట్ర జరుగుతున్న పోలీసులు పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ఇప్పటికే ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకొని మృతి చెందాడని మరో వ్యక్తి ప్రాణభయంతో 17 పేజీల సూసైడ్ నోట్ రాసి గత వారం రోజుల కింద అజ్ఞాతంలోకి వెళ్లాడని చెప్పారు. ఈ విషయంపై జాతీయ ఎస్సీ , ఎస్టీ కమిషన్ ఆశ్రయించి ఈ కుట్ర కారకులపై కఠిన చర్య తీసుకునేలా ముందుకు కొనసాగుతామన్నారు. ఇంటలిజెన్స్ లోతుగా దర్యాప్తు చేస్తే.. కానీ దీని మూలాలు... కుట్ర విషయాలు బయటకు వచ్చే అవకాశం లేదని తెలిపారు.

Next Story