భీష్మరాజ్ ఫౌండేషన్ సేవలను మరింత విస్తృతం చేస్తాం

by Naveena |

భీష్మరాజ్ ఫౌండేషన్ సేవలను మరింత విస్తృతం చేస్తామని, వెనకబడిన నారాయణపేట జిల్లాలో విద్యా, వైద్యం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని ఫౌండేషన్ చైర్మెన్ డా. రాజ్ కుమార్ రెడ్డి అన్నారు.

భీష్మరాజ్ ఫౌండేషన్ సేవలను మరింత విస్తృతం చేస్తాం
X

దిశ, నారాయణపేట ప్రతినిధి: భీష్మరాజ్ ఫౌండేషన్ సేవలను మరింత విస్తృతం చేస్తామని, వెనకబడిన నారాయణపేట జిల్లాలో విద్యా, వైద్యం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని ఫౌండేషన్ చైర్మెన్ డా. రాజ్ కుమార్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో ఉగాది పర్వదినం సందర్భంగా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా బృందం చే ముఖా ముఖి నిర్వహించి పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా ఫౌండేషన్ చైర్మన్ కు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. ఫౌండేషన్ చైర్మన్ రాజ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. నారాయణపేట జిల్లా పరిధిలో ఎంతో మంది పొట్టకూటి కోసం నానా ఇబ్బందులు పడుతున్నారని, అలాంటి వారిని ఆదుకునేందుకు తమ వంతు కృషి చేస్తూ ముందుకు సాగుతున్నామన్నారు. ఎంతోమంది చదువుకునే వీలు లేక చదువులో వెనక పడుతున్నారని.. అలాగే ఎంతో మంది మెరుగైన వైద్యం అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు.

అలాంటి వారికోసం ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ వెళ్తున్నామని,తమ వెంట ఎలాంటి రాజకీయ పార్టీ లేదని భవిష్యత్తు కార్యాచరణ మాటకు వస్తే సేవ ఒక్కటేనన్నారు. అనంతరం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి కార్యక్రమం నిర్వహించారు. టీయూడబ్ల్యూజే ఐజేయు నారాయణ పేట జిల్లా అధ్యక్షులు కోయిల్ కొండ నారాయణ రెడ్డి, గణప రఘు, నక్క శ్రీనివాస్ , సులిగెం సురేష్, ఆకుల, రాజేష్, మహమ్మద్ తకి, శ్రీనివాస్, హనుమంతు, విష్ణు, అంబదాస్, శివ, ప్రవీణ్, రమాకాంత్ , నర్సింలు, శ్రీనివాస్ , సంజీవ ప్రకాష్ , రాజశేఖర్ , శ్రీధర్ , నరసింహ, ఆనంద్ , లింగం, రాము, యశ్వంత్ , అంజి, భాస్కర్ రెడ్డి, లక్ష్మణ్ తో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా బృందం సభ్యులు పాల్గొన్నారు.

Next Story