సీఎం ఇంటిని, డీజీపీ ఆఫీస్ ముట్ట‌డిస్తాం : ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రవి నాయక్

by Ratna Kumari |

దిశ, నారాయణపేట ప్రతినిధి : మద్దూర్ లో గిరిజన వ్యక్తి పై జరిగిన ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి నిందితులను అరెస్టు చేయాలని లేకపోతే

సీఎం ఇంటిని, డీజీపీ ఆఫీస్ ముట్ట‌డిస్తాం : ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రవి నాయక్
X

దిశ, నారాయణపేట ప్రతినిధి : మద్దూర్ లో గిరిజన వ్యక్తి పై జరిగిన ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి నిందితులను అరెస్టు చేయాలని లేకపోతే సీఎం ఇంటిని, డీజీపీ కార్యాల‌యాన్ని ముట్టడిస్తామని ఎస్టీ మోర్చా రాష్ట్ర అద్యక్షులు రవి నాయక్ పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర సీనియర్ నేత నాగురావు నామాజీ తో కలిసి మంగళవారం నారాయణపేట ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మద్దూరు మండల కేంద్రం లో ఇస్లామిక్ వాదులు అరాచకాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. అందుకు తాజొద్దిన్, యాసిన్ అనే ఇద్దరూ అప్పులు ఇస్తామని అమాయక ప్రజలను వలలో వేసుకొని చివరకు అప్పులు ఇవ్వకుండానే ఇచ్చినట్టు పత్రాలు రాసుకొని మతం మారాలని... బంగారు నాణెలు ఓచోట ఉన్నాయని అవి తీసుకు వస్తే నజరానా ఇస్తామని అమాయక ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. మతం మారితే పాకిస్తాన్ నుండి తమకు వచ్చే డబ్బుల్లో రూ. 2 లక్షలు ఇస్తామని చెబుతూ సంఘ విద్రోహ కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇస్లామిక్ ఉగ్రవాదుల అరాచకాలకు ఒక గిరిజన యువకుడు వారి బాధలు భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని సూసైడ్ నోట్ రాసిన ఘటనపై నియోజకవర్గ ఎమ్మెల్యే గా సీఎం రేవంత్ రెడ్డి స్పందించి సమగ్ర విచారణ జరిపి నిజాలను నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై రామచంద్రప్ప, తాజుద్దీన్ ఫోన్లను సీజ్ చేసి విచారణ చేస్తే పూర్తి విషయాలు బయటపడతాయన్నారు. ప్రెస్ మీట్ లో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కళ్యాణ నాయక్, జిల్లా బిజెపి అద్యక్షులు సత్య యాదవ్, పి.శ్రీనివాసులు, లక్ష్మి శ్యామ్ సుందర్ గౌడ్, తిరుపతి రెడ్డి పాల్గొన్నారు.

Next Story